‘జై భీమ్’ సినిమా వివాదంపై సూర్యనే బాధ్యత వహించాలనడం అన్యాయమని దర్శకుడు జ్ఞానవేల్ అన్నారు. ఈ వివాదంపై జ్ఞానవేల్ తాజాగా స్పందించారు. ఈ చిత్రంపై గత కొన్ని రోజులుగా వస్తున్న విమర్శలు, రేగిన చర్చలు, తలెత్తిన వివాదాలపై జ్ఞానవేల్ తాజాగా స్పందించారు. సినిమా వివాదంలో కీలకంగా మారిన కేలండర్ గురించి, ఇతర విషయాల గురించి ఆయన స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. విడుదలకు ముందు మా బృందంలోని కొందరం సినిమా చూశాం.
అయితే ఆ క్యాలెండర్ దృశ్యాన్ని గమనించలేదు. అప్పుడే చూసుంటే విడుదలకు ముందే సినిమా నుండి ఆ సన్నివేశాన్ని లేదా ఫ్రేమ్‌ను తొలగించేవాళ్లం. సినిమా విడుదలైన రోజు దీనిపై అభ్యంతరం వ్యక్తమైంది. పరిస్థితి ముదురుతోందని గ్రహించి అప్పుడే ఆ సన్నివేశంలో మార్పులు చేశాం. కానీ ఈ విషయంలో సూర్యదే బాధ్యత అంటూ కావాలనే ఆయన్ని టార్గెట్ చేస్తున్నారు. ఇది భావ్యం కాదు అన్నారు జ్ఞానవేల్. సూర్య.. ఓ నటుడిగా, నిర్మాతగా గిరిజనులు ఎదుర్కున్న సమస్యల్ని వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.
చేశాడంతే! సినిమా జరిగిన పరిణామాల విషయంలో క్షమించమని సూర్యను కోరుతున్నాను. ఈ సినిమాను ఓ వ్యక్తిని లేదంటే వర్గాన్ని కించపరిచాలని రూపొందించలేదు. ఈ సినిమాతో బాధపడిన అందరికీ క్షమాపణలు చెబుతున్నాను. చేయని తప్పునకు జైలు పాలై, ప్రాణాలు కోల్పోయిన భర్త పరిస్థితి మరొకరికి రాకూడదని ఓ మహిళ చేసిన న్యాయపోరాటం ఈ సినిమా.
Most Recommended Video
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!