Rajini – Kamal: రజనీకాంత్‌కి డైరక్టర్‌ దొరకకపోవడం ఏంటి? కొత్త ఏడాదిలో అయినా సెట్‌ అవుతారా?

కమల్‌ హాసన్‌, రజనీకాంత్‌ కలసి సినిమా చేయాలని ఎన్నో ఏళ్లుగా అభిమానులు కోరుకున్నారు. ఇద్దరూ ఒకే వేదిక మీదకు వచ్చినప్పుడు, ఒకే వేడుకకు వచ్చినప్పుడు ఇదే ప్రశ్న వినిపించేది. దానికి ఇద్దరి నుండి ఆశించిన సానుకూల సమాధానమే వచ్చేది. అయితే ఏమైందో ఏమో చాలా ఏళ్లు ఈ ప్రాజెక్ట్‌ ఓకే అవ్వలేదు. కట్‌ చేస్తే మొన్నామధ్య అనూహ్యంగా తామిద్దరం కలసి ఓ సినిమ చేస్తున్నామని కమల్‌ హాసన్‌ అనౌన్స్‌ చేశారు. దీంతో ఇద్దరినీ ఒకే ఫ్రేమ్‌లో చూడొచ్చు అనుకున్నారంతా. కానీ తాను నిర్మాతను మాత్రమే అని కమల్‌ చెప్పడంతో కాస్త నిరుత్సాహం చెందారు. కానీ కాంబో కుదిరింది కదా అని ఆనందపడ్డారు.

Rajini – Kamal

ఈ క్రమంలో సినిమా అనౌన్స్‌మెంట్‌ భారీగానే సాగింది. ప్రముఖ దర్శకుడు సుందర్‌.సి దర్శకత్వంలో ఈ సినిమా ఉంటుందని కాంబినేషన్‌ ఫొటోలు రిలీజ్‌ చేసి మరీ చెప్పారు. అయితే ఆ ప్రాజెక్ట్ ప్రకటించిన కొన్ని రోజులకే సుందర్‌.సి ఈ సినిమా నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో ఏమైందా అనేది ఎవరికీ అర్థం కాలేదు. అనూహ్యంగా ఇప్పటివరకు ఆ సినిమా గురించి ఆ తర్వాత ఎలాంటి అప్‌డేట్‌ లేదు. దీంతో ఈ సినిమా ఏమైందా అనే డౌట్‌ మొదలైంది. రజనీ – కమల్‌ కాంబోకి హీరో దొరకకపోవడమేంటి అనే చర్చ మొదలైంది.

కమల్‌ – రజనీ సినిమాకు దర్శకుడిగా సుందర్‌.సి పేరు అనౌన్స్‌ కాకముందు.. చాలా పేర్లు వినిపించాయి. లోకేశ్‌ కనగరాజ్‌ దాదాపు ఫిక్స్‌ అనుకున్నారు. కానీ ‘కూలీ’ సినిమా తేడా కొట్టడంతో ఆ ప్రాజెక్ట్ అవ్వలేదు. ఆ తర్వాత ప్రదీప్‌ రంగనాథన్‌ పేరు వినిపించింది. వీళ్లెవరూ అవ్వలేదు. ఇక సుందర్‌.సి వద్దు అనుకున్న తర్వాత ‘డ్రాగన్‌’ దర్శకుడు అశ్వత్‌ మరిముత్తు పేరు బయటకు వచ్చింది. ఆ వెంటనే ‘పార్కింగ్’ సినిమా ఫేమ్ రామ్ కుమార్ బాలకృష్ణన్ పేరు వినిపించింది. ఇప్పుడు నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ పేరు వినిపిస్తోంది. కొత్త సంవత్సరంలో అయినా ఈ విషయంలో క్లారిటీ వచ్చి అనౌన్స్‌మెంట్‌ వస్తే బాగుండు.

బన్ని వాస్‌ రూ.6 కోట్లు లాస్.. ఫైనల్‌ కాపీ చూడకనే అలా అయిందట!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus