Koratala Siva: ఆ డైరెక్టర్లతో కొరటాల శివ ప్లాన్!

  • September 18, 2021 / 03:44 PM IST

కరోనా సమయంలో ఏదైనా బిజినెస్ కి క్రేజ్ వచ్చిందంటే అది ఓటీటీ అనే చెప్పాలి. థియేటర్లు క్లోజ్ అవ్వడంతో జనాలంతా ఓటీటీలపై పడ్డారు. చాలా సినిమాలను ఓటీటీలో నేరుగా రిలీజ్ చేశారు. కొందరు స్టార్ హీరోలు నటించిన సినిమాలు కూడా ఓటీటీలోకి వచ్చాయి. దీంతో ఇండస్ట్రీకి చెందిన చాలా మంది సార్లు ఓటీటీలో ఎంట్రీ ఇచ్చేశారు. ఇప్పుడు స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడని సమాచారం. దర్శకుడిగా ఎంతో బిజీగా ఉన్న కొరటాల ఇప్పుడు ఓటీటీ ఛానెల్స్ కోసం కొన్ని కథలు సిద్ధం చేస్తున్నారట.

వీటికోసం తనకు బాగా తెలిసిన కొంతమంది దర్శకులతో కలిసి ఓ గ్రూప్ ను తయారు చేశారు. కొరటాల శివ గైడెన్స్ లో కొంతమంది దర్శకుడు ఓటీటీ కోసం కథలు సిద్ధం చేస్తున్నారు. ఓటీటీ సంస్థల నుంచి అనుమతులు వచ్చిన తరువాత స్వయంగా కొరటాల శివ ఈ సినిమాలను నిర్మిస్తారట. దర్శకుడిగా మాత్రం తనతో పని చేస్తున్న వాళ్లకు అవకాశమిస్తాడట. ప్రస్తుతం ఈ డైరెక్టర్ ‘ఆచార్య’ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది.

ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ తో మరో సినిమా కమిట్ అయ్యారు. ఆ సినిమాకి కథను సిద్ధం చేస్తూనే మరోపక్క ఓటీటీపై దృష్టి పెడుతున్నారు. మొత్తానికి ఈ స్టార్ డైరెక్టర్ ప్లానింగ్ మాములుగా లేదు..!

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus