ఆ పుస్తకం ఆధారంగా సినిమా తీశా!

దర్శకుడు క్రిష్ ఈ మధ్యకాలంలో వైష్ణవ్ తేజ్, రకుల్ హీరో హీరోయిన్లుగా ఓ సినిమాను పూర్తి చేసిన సంగతి తెలిసిందే. సినిమా షూటింగ్ పూర్తయినప్పటికీ అసలు ఈ సినిమా కథ ఏంటి..? హీరో, హీరోయిన్ల పాత్రలేంటి..? అనే విషయాలు బయటకి రాలేదు. టైటిల్ ఏం అనుకుంటున్నారో కూడా క్రిష్ చెప్పలేదు. ఫైనల్ గా ఈ సినిమా గురించి క్రిష్ మాట్లాడారు. లాక్ డౌన్ టైమ్ లో చదివిన ఓ పుస్తకం తనను బాగా కదిలించిందని.. ఎంతలా అంటే వెంటనే సినిమాగా తీసేయాలని అనిపించిందని చెప్పుకొచ్చాడు. ఆ పుస్తకం పేరు ‘కొండపొలం’.

తను పవన్ కళ్యాణ్ సినిమాపై సీరియస్ గా పని చేస్తున్నప్పుడు.. ఓ రోజు రాత్రి ‘సప్తభూమి’ అనే పుస్తకం చదివారా. ఆ తరువాత రెండు, మూడు రోజులకు ‘కొండపొలం’ అనే పుస్తకం చదివినట్లు చెప్పారు. రాత్రి 4 గంటల వరకు ఆ పుస్తకం చదివానని.. ఆ తరువాత నిద్ర పట్టలేదని.. ఆ మరోసారి రోజు కూడా నిద్ర పట్టలేదని.. వెంటనే తన పార్ట్నర్ కి చెప్పి రైట్స్ తీసుకోమన్నానని వెల్లడించారు. రెండు, మూడేళ్ల తరువాత సినిమా చేయాలని ప్లాన్ చేసుకున్నప్పటికీ.. ఆ పుస్తకమే మైండ్ లో తిరుగుతుండంతో.. వెంటనే సినిమా తీయాలని నిర్ణయించుకున్న విషయాన్ని వెల్లడించారు.

పవన్ కళ్యాణ్ కూడా మధ్యలో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. వెంటనే రకుల్-వైష్ణవ్ తేజ్ లను సంప్రదించి.. రెండు వారాల్లో షూటింగ్ మొదలుపెట్టేశామని చెప్పుకొచ్చారు. ఇలా ‘కొండపొలం’ అనే పుస్తకం ఆధారంగా సినిమా తీసిన విషయాన్ని వెల్లడించాడు క్రిష్. ఈ సినిమా రకుల్ రాయలసీమ అమ్మాయిగా, ఓబులమ్మ అనే అమ్మాయిగా కనిపించబోతుంది. ఈ సినిమాకి కూడా ‘కొండపొలం’ అనే టైటిల్ పెట్టాలనుకుంటున్నాడట క్రిష్.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus