‘ఎన్టీఆర్ మహానాయకుడు’ విషయంలో క్రిష్ సైలెన్స్ అందుకేనా…?

ఇటీవల ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ ట్రైలర్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. అయితే ‘ఎన్టీఆర్ – కథానాయకుడు’ ట్రైలర్ కి వచ్చిన ఆదరణ ఈ ట్రైలర్ కి రావట్లేదనే చెప్పాలి. ఇక ఫిబ్రవరి 22 న (మరో రెండు రోజుల్లో) ఈ చిత్రాన్ని విడుదల కాబోతుంది. అయినా ఈ చిత్రానికి సంబంధించి ఎటువంటి ప్రమోషన్లు నిర్వహించడం లేదు చిత్ర యూనిట్. దీనికి ప్రధాన కారణం ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ డిజాస్టర్ కావడమే అని తెలుస్తుంది. మొదట ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ చిత్రానికి మంచి టాకే వచ్చింది, రివ్యూలు కూడా పాజిటివ్ గానే వచ్చినప్పటికీ … కలెక్షన్లను మాత్రం రాబట్టలేక చతికిలపడిపోయింది.

మొదటి నుండీ ‘మహానాయకుడు’ సినిమా పై ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంది. ఈ సినిమా బాగా రాలేదని పక్కన పెట్టేశారని వార్తలొచ్చాయి కానీ, ముందుగానే ప్రకటించారు కాబట్టి ఇప్పుడు రిలీజ్ చేయకపోతే పరువు పోతుందేమోనాని భావించి ఎదో నామమాత్రంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారని ఫిలింనగర్ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు. ఇక ఈ చిత్ర దర్శకుడు క్రిష్ అయితే ప్రస్తుతం ఎక్కడా కనిపించడం లేదు, ఈ చిత్ర షూటింగ్ సమయంలో బాలయ్యతో తలెత్తిన వివాదాలే ఇందుకు కారణమని తెలుస్తుంది. గతంలో క్రిష్ సినిమాలు ప్లాప్ అయినప్పటికీ ఆ చిత్రాలకి ప్రేక్షకుల నుండీ ఓ ప్రత్యేక గౌరవం ఉంటుందనడంలో సందేహం లేదు.

అయితే అనవసరంగా క్రిష్ ‘ఎన్టీఆర్ బయోపిక్’ లోకి ఎంటరయ్యి ఎన్నడూ లేని విధంగా అపకీర్తి మూటకట్టుకున్నాడని పలువురు ఫిలింనగర్ విశ్లేషకులు చెబుతున్నారు. ఒక పక్క ‘మణికర్ణిక’ చిత్రం నుండీ బయటకి వచ్చేయడం… దానితో కంగనాతో వివాదం… మరో పక్క ‘ఎన్టీఆర్ బయోపిక్’ ను క్రిష్ సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయాడని… ఇలా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. ఒక విధంగా బాలయ్య, చంద్రబాబు లు… ఈ చిత్రం విషయంలో క్రిష్ పై చాలా ఒత్తిడి చేశారనే టాక్ కూడా నడుస్తుంది. వాస్తవాలను, ఎన్టీఆర్ ఎదుర్కొన్న ఒడుదుడుకులని పక్కన బెట్టి… కేవలం ప్లస్ పాయింట్లని మాత్రమే చూపించమని బాలయ్య,చంద్రబాబు లు… క్రిష్ కి అడుగడునా అడ్డుపడ్డారంట. ఈ కారణంగానే ‘ఎన్టీఆర్ – మహానాయకుడు’ ప్రమోషన్లకు కూడా క్రిష్ నిరాకరించాడని సమాచారం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus