‘రీ రిలీజ్..ల ట్రెండ్ ఇక ముగిసింది’ అంటూ మొన్నామధ్య చాలా మంది అభిప్రాయపడ్డారు. కానీ ‘అవి కేవలం అపోహలే’ అని ఇటీవల రీ- రిలీజ్ అయిన ‘మురారి’ (Murari) తేల్చేసింది. మహేష్ బాబు (Mahesh Babu) పుట్టినరోజు సందర్భంగా 4K లో రీ రిలీజ్ అయిన ‘మురారి’ చిత్రం.. సెన్సేషనల్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది. వాస్తవానికి ‘మురారి’ ని రీ రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించినప్పుడు.. అభిమానుల్లో పెద్దగా ఆసక్తి కనిపించలేదు. ‘ఏమాత్రం మాస్ ఎలిమెంట్స్ లేని ఈ సినిమాని రీ రిలీజ్ లో ఏం చూస్తామని’ పెదవి విరిచారు అభిమానులు.
కానీ ఊహించని విధంగా ఈ సినిమాకి ఫ్యామిలీస్ తో వచ్చి మరీ ప్రేక్షకులు థియేటర్ ఎక్స్పీరియన్స్ పొందారు. ‘మురారి’ ఓ క్లాసిక్. అందులో డౌట్ లేదు. ‘రాజకుమారుడు’ (Rajakumarudu) తర్వాత మహేష్ బాబుని సక్సెస్ ట్రాక్ ఎక్కించింది ఈ సినిమానే. అంతేకాదు..ఏ హీరోకి అయినా 10 సినిమాలకి కానీ సంపూర్ణ నటుడు అనే ఇమేజ్ రాదు. కానీ మహేష్ బాబుకి ‘మురారి’ రూపంలో 4వ సినిమాకే ఆ ఘనత దక్కింది. ఈ సినిమా వచ్చి 23 ఏళ్ళు అవుతుంది.
ఒకవేళ దీనికి సీక్వెల్ అంటూ తీస్తే.. మహేష్ తనయుడు గౌతమ్ బాగా సెట్ అవుతాడు అనే ఆలోచన అభిమానులకి వచ్చింది. ట్విట్టర్ లో దీని గురించి చర్చలు జరపగా.. ‘అది నా చేతుల్లో లేదు మహేష్, నమ్రత (Namrata Shirodkar) ..ల చేతుల్లో ఉంటుంది’ అంటూ కృష్ణవంశీ (Krishna Vamsi) రియాక్ట్ అయ్యి మాట దాటేశారు. సో ‘మురారి’ సీక్వెల్ ఆలోచన ఆయనకు లేనట్టే..! ఒకవేళ గౌతమ్ తో వేరే దర్శకుడు ‘మురారి 2’ చేసినా.. దానికి ‘మురారి’ అందం రాదనే చెప్పాలి.