టాలీవుడ్ దర్శకుడు మారుతికి పితృవియోగం!
- April 21, 2022 / 08:58 AM ISTByFilmy Focus
ప్రముఖ దర్శకుడు మారుతి ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి దాసరి వన కుచలరావు (76) బుధవారం అర్ధరాత్రి కన్నుమూశారు. మచిలీపట్నంలోని తన స్వగృహంలో ఆయన తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వనకుచలరావు బుధవారం రాత్రి చనిపోయారు. వన కుచలరావు మరణ వార్తతో మారుతి కుటుంబంలో విషాదం అలముకుంది. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు మారుతికి ఫోన్ చేసి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.

టాలీవుడ్‌లో మారుతి సక్సెస్ ఫుల్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. చిన్న హీరోల నుండి పెద్ద హీరోల వరకు అందరికీ తనదైన శైలిలో సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఈ సమయంలో ఆయనకు పితృవియోగం కలగడం అందరిని కలచివేస్తోంది. మారుతి చిన్న వయసులో వన కుచలరావు థియేటర్ ముందు బండి మీద అరటిపళ్లు అమ్మేవారట. అలా ఎంతో కష్టపడి కుటుంబాన్ని పోషించేవారని మారుతి గతంలో కొన్ని సందర్భాల్లో చెప్పారు.
‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

















