NTR 31: ప్రశాంత్ నీల్ రెమ్యునరేషన్ ఎంతంటే?

కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన దర్శకుడు ప్రశాంత్ నీల్ ఒక్క KGF సినిమాతోనే పాన్ ఇండియా దర్శకుడిగా బ్రాండ్ సెట్ చేసుకున్నాడు. KGF చాప్టర్ 2 రాకముందే అతనికి వరుసగా అవకాశాలు వస్తున్నాయి. ఈ రేంజ్ లో ఛాన్సులు వస్తాయని ఎవరు ఊహించలేదు. రెండు పాన్ ఇండియా సినిమాలు విడుదలకు రెడీగా ఉన్నప్పటికీ మరొక సినిమాను ఎనౌన్స్ చేశాడు. KGF 2 విడుదలకు రెడీగా ఉన్న విషయం తెలిసిందే.

కరోనా వైరస్ తగ్గుముఖం పడితే సినిమా థియేటర్లలోకి రావడానికి ఎంతో సమయం పట్టదు. ఇక ఆ సినిమా అనంతరం రెబల్ స్టార్ ప్రభాస్ తో సలార్ సినిమాను సెట్స్ పైకి తీసుకువచ్చిన ప్రశాంత్ వచ్చే ఏడాది సమ్మర్ లో అనుకున్న సమయానికే విడుదల చేయాలని ప్లాన్ రెడీ చేసుకుంటున్నాడు. ఇక జూనియర్ ఎన్టీఆర్ 31వ సినిమా కోసం కూడా పవర్ఫుల్ గా రెడీ అవుతున్న ప్రశాంత్ రెమ్యునరేషన్ కూడా గట్టిగానే అందుకుంటున్నట్లు సమాచారం.

మైత్రి మూవీ మేకర్స్ తో గత ఏడాదలోనే డీల్ సెట్ చేసుకున్న ప్రశాంత్ 10కోట్లకు ఓకే చెప్పినట్లు సమాచారం. KGF 2, సలార్ సినిమాల కంటే ఇది ఎక్కువే. ఓకేవేళ ఆ సినిమాల అనంతరం ఒప్పుకొని ఉంటే అతని రెమ్యునరేషన్ మరింత పెరిగే ఛాన్స్ ఉండేదని చెప్పవచ్చు. ఇక ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్ సినిమాను కొరటాల శివ ప్రాజెక్ట్ అనంతరం మొదలు పెట్టనున్నాడు.

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus