‘బాహుబలి’తో (Baahubali) పాన్ ఇండియా మార్కెట్‌లో కొత్త ట్రెండ్ సృష్టించిన దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి (S. S. Rajamouli) … తెలుగు సినిమా స్థాయిని పెంచారు. ఆయన వేసిన బాటలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం నుండి పాన్ ఇండియా సినిమాలు వస్తున్నాయి. బాలీవుడ్‌పై అవి జైత్రయాత్ర చేస్తున్నాయి అనే చెప్పాలి. సౌత్ సినిమాల దెబ్బకు హిందీ చిత్ర పరిశ్రమ వణికిపోతోంది. ‘దీనంతటికి కారణం ఎస్ ఎస్ రాజమౌళి’ (Rajamouli) అని ఎవరైనా ఒప్పుకుని తీరాల్సిందే. అయితే పాన్ ఇండియా చిత్రాలను తెరకెక్కించడానికి తనకు ఓ హీరోనే స్ఫూర్తి అని తాజాగా జరిగిన ‘కంగువా’ (Kanguva) ఈవెంట్లో చెప్పారు జక్కన్న.
ఆ హీరో మరెవరో కాదు సూర్య (Suriya). ‘సిరుతై’ శివ (Siva) దర్శకత్వంలో సూర్య హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ ‘కంగువా’. చిల్డ్రన్స్ డే రోజున అంటే నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జక్కన్న మాట్లాడుతూ.. ‘తెలుగు సినిమాను విశ్వవ్యాప్తం చేయడంలో నాకు సూర్యనే స్ఫూర్తి అన్నారు.
గజిని రిలీజ్ టైంలో సూర్య చేసిన ప్రచారాన్ని నేను క్షుణ్ణంగా అధ్యయనం చేశాను , పర భాషా నటుడు తెలుగు ప్రేక్షకులకు ఎలా చేరువయ్యాడు? అనే దానిపై హీరోలకు, నిర్మాతలకు చెప్పేవాడిని’ అని రాజమౌళి గుర్తు చేసుకున్నారు.’బాహుబలి’ సిరీస్‌కు సూర్యనే ఇన్‌స్పిరేషన్. ఆయనతో కలిసి ఓ సినిమా చేయాలని ప్లాన్ చేశాను. కానీ కుదర్లేదు, నేనే సూర్యతో ఛాన్స్ మిస్ అయ్యాను’ అంటూ చెప్పుకొచ్చాడు.
ఆ తర్వాత సూర్య కూడా ‘నేను ట్రైన్ మిస్ చేసుకుని స్టేషన్ లో వెయిట్ చేస్తున్నాను అని చెప్పడానికి సిగ్గు పడుతున్నాను’ అంటూ రాజమౌళితో సినిమా మిస్ చేసుకున్న సందర్భాన్ని గుర్తుచేసుకున్నాడు. మరి వీరి కాంబినేషన్లో మిస్ అయిన సినిమా ఏమై ఉంటుందో అని నెటిజెన్లు ముచ్చట్లు పెట్టుకుంటున్నారు.