సుప్రసిద్థ నిర్మాత ఏ.ఎం. రత్నం సమర్పణలో స్టార్‌లైట్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి నిర్మిస్తున్న చిత్రం ‘రూల్స్ రంజన్ ’. కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి రత్నం కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. అమ్రిష్ గణేష్ సంగీతం అందిస్తున్నారు. అక్టోబర్ 6న విడుదల కానున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక శనివారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో దర్శకుడు రత్నం కృష్ణ మాట్లాడుతూ ‘‘పక్కా యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ఇది.
కాలేజ్ పూర్తిగా కాగానే ఎవరికైనా జాబ్, శాలరీ, ఆ తర్వాత అందమైన లవర్ కావాలనుకుంటారు. అలాంటి కథను ఎంటర్‌టైన్‌మెంట్ వేలో చెప్పాం. నా గత చిత్రం యాక్షన్ జానర్‌లో చేశా. ఇది పక్కా ఎంటర్‌టైనర్‌గా తీశా. నాకు సీనియర్ ఎన్టీఆర్ నటించిన ‘మిస్సమ్మ’, గుండమ్మ కథ, అప్పు చేసి పప్పు కూడు వంటి చిత్రాలంటే చాలా ఇష్టం. ఆ తర్వాత పవన్‌కల్యాణ్ నటించిన ఖుషి, గబ్బర్‌సింగ్, జల్సా, అత్తారింటికి దారేది చిత్రాలు ఎక్కువగా నచ్చాయి. అలాంటి చిత్రాల స్ఫూర్తితో ఈ సినిమా చేశాం.
నా (Rathinam Krishna) తొలి చిత్రం 19 ఏళ్ల వయసులో చేశా. కానీ అప్పుడు నాతో పని చేసి రెహమాన్, తోట తరణి, పి.స్రిశీరామ్ వంటి సీనియర్లు పని చేశారు. ఈ చిత్రానికి నేనే సీనియర్‌ని. ఈ సినిమాకు పనిచేసిన వారంత భవిష్యత్తులో మంచి టెక్నీషియన్లు అవుతారు. వెన్నెల కిశోర్ పాత్ర ఈ చిత్రానికి సెకండ్ హీరోలాగా ఉంటుంది. ఆయన ఆ పాత్ర చేయకపోతే సినిమా ఆగిపోయేదేమో. ఆది, హర్ష, వెన్నెల కిశోర్ కాంబినేషన్‌కు సెట్ చేయడానికి నాలుగు నెలలు పట్టింది.
కిరణ్ అబ్బవరం యూట్యూబ్ నుంచి వచ్చి పెద్ద స్ర్కీన్ మీద తనెంటో నిరూపించుకున్నాడు. నిర్మాతలు ఎంతో సపోర్ట్ చేశారు. తమిళ నటుడు వివేక్‌గారి తర్వాత అంతటి ఈజ్ నాకు హైపర్ ఆదిలో కనిపించింది. నా తొలి సినిమా ునీ మనసు నాకు తెలుసు’ తర్వాత తెలుగులో ఆక్సిజన సినిమా చేయడానికి నాకు 15 ఏళ్లు పట్టింది. ఈ గ్యాప్‌లో నాన్నకు ప్రొడక్షన్‌లో సహకరించా. ‘హరిహర వీరమల్లు’ సినిమా చేస్తూ బయటకు వచ్చి ఈ సినిమా చేశా.
ఈ సినిమా హిట్ కొడితే మీ నాన్న హిట్ అయినట్లే అని బయట చాలామంది అన్నారు. అయితే మా నాన్నఎప్పుడు సక్సెస్‌ఫుల్ పర్సన్. ఆయనకు సక్సెస్ కొత్తేమి కాదు. నేను సిక్స్ కొట్టడానికి దొరికిన లాస్ట్ బాల్ ఇది. తప్పకుండా సిక్సర్ కొడతా’’ అని అన్నారు.
స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!
చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !