సీనియర్ నటుడు రవిబాబు అందరికీ సుపరిచితమే. చలపతిరావు తనయుడిగా సినిమాల్లోకి అడుగుపెట్టిన రవిబాబు.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు. తర్వాత అమెరికా వెళ్లి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో శిక్షణ తీసుకున్నారు. తిరిగొచ్చి ‘అల్లరి’ అనే సినిమా తీశారు. అది మంచి విజయం అందుకుంది. అటు తర్వాత ‘అమ్మాయిలు అబ్బాయిలు’ ‘సోగ్గాడు’ ‘అనసూయ’ ‘నచ్చావులే’ ‘మనసారా’ వంటి విజయవంతమైన సినిమాలు తీశారు.
కొన్నాళ్లుగా ఈయన డైరెక్షన్ కి దూరంగా ఉన్నారు. అప్పుడప్పుడు పెద్ద సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్నారు. ఇక రవిబాబు వంటి సీనియర్ దర్శకులకు ఓటీటీల్లో మంచి డిమాండ్ ఉంది. ఇప్పుడు ఈటీవీ విన్ కోసం ‘ఏనుగు తొండం ఘటికాచలం’ అనే సినిమా చేశారు రవిబాబు. దీని ప్రమోషన్స్ లో భాగంగా పలు యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఇందులో భాగంగా హీరోయిన్ పూర్ణతో గతంలో వచ్చిన రూమర్స్ పై రవిబాబు స్పందించి క్లారిటీ ఇచ్చారు.
రవిబాబు మాట్లాడుతూ…”పూర్ణతో వరుస సినిమాలు చేయడం వల్లే ఆ తప్పుడు వార్తలు పుట్టుకొచ్చాయి. ఆమె ఎక్కడో కేరళలో పుట్టింది. నేను ఇక్కడ పుట్టాను. కానీ సంబంధం లేకుండా మా మధ్య లింక్ పెట్టారు. మీడియా కూడా దాన్నే ఎక్కువగా హైలెట్ చేసింది. అందులో నిజం లేదు. నేను కథకు, పాత్రకు సరితూగే వాళ్ళని హీరోయిన్లుగా తీసుకుంటాను.
‘అవును’ సినిమా కథకు ఆమె పర్ఫెక్ట్ ఛాయిస్ అనిపించింది. అందుకే ఆమెను తీసుకున్నాను. పూర్ణ కూడా హార్డ్ వర్కర్..! డెడికేషన్‌తో పనిచేస్తుంది. ఆమె పనితనం చూస్తున్నప్పుడు ‘వన్ మోర్’ అడగాలంటే భయమేస్తుంటుంది.ఆమెకు ఫైట్స్ రావు కానీ.. వచ్చి ఉంటే నా నెక్స్ట్ సినిమా ‘రష్’ లో కూడా ఆమెనే మెయిన్ లీడ్ గా తీసుకునేవాడిని” అంటూ క్లారిటీ ఇచ్చాడు.