Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » “ఒరేయ్ బామ్మర్ది” సినిమాలో బావ బావమరిది రిలేషన్స్ ఆకట్టుకుంటాయి – దర్శకుడు శశి

“ఒరేయ్ బామ్మర్ది” సినిమాలో బావ బావమరిది రిలేషన్స్ ఆకట్టుకుంటాయి – దర్శకుడు శశి

  • August 3, 2021 / 06:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

“ఒరేయ్ బామ్మర్ది” సినిమాలో బావ బావమరిది రిలేషన్స్ ఆకట్టుకుంటాయి – దర్శకుడు శశి

భావోద్వేగ కథలతో సినిమాలు చేస్తూ దక్షిణాదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు దర్శకుడు శశి. ఆయన తెరకెక్కించిన శీను, రోజాపూలు, బిచ్చగాడు లాంటి చిత్రాలు ప్రేక్షకులకు ఎమోషనల్ ఫీల్ పంచాయి. సిద్దార్థ్, జీవీ ప్రకాష్ కుమార్ హీరోలుగా శశి రూపొందించిన కొత్త సినిమా ఒరేయ్ బామ్మర్ది ఆగస్టు 13న థియేటర్ లలో విడుదల కాబోతోంది. శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్ పతాకంపై ఏఎన్ బాలాజీ తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దర్శకుడు శశి సినిమా విశేషాలను పంచుకున్నారు.

దర్శకుడు శశి మాట్లాడుతూ….హ్యూమన్ ఎమోషన్స్ లేకుండా నేను ఏ సినిమా చేయను. బిచ్చగాడు సినిమాలో తల్లీ కొడుకు మధ్య ప్రేమను చూపించాను. ఒరేయ్ బామ్మర్ది చిత్రంలో బావ బావమరిది మధ్య అనుబంధాలను చూపిస్తున్నాం. బావ బావమరిది మధ్య అనుబంధం చాలా ప్రత్యేకమైనది. నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు మా సినిమాకు పనిచేసే ఒక రచయితను నీకు పెళ్లి అయ్యిందా అని అడిగితే ఆయన ఈ మధ్యే నేను పెళ్లి చేసుకున్నాను, నా భార్య చిన్న తమ్ముడు మంచి ఫ్రెండ్ అయ్యాడు. నా తమ్ముడి కంటే ఈ బావమరిది తోనే నేను ఎక్కువ చనువుగా ఉంటాను, అతను ఎవరు చెప్పింది విన్నా వినకున్నా, నా మాట మాత్రం తప్పకుండా వింటాడు, కొడుకు, తమ్ముడు, ఫ్రెండ్ అన్నీ వాడే నాకు అని చెప్పాడు.

ఆ రిలేషన్ నాకు గొప్పగా అనిపించింది. అప్పుడే ఒరేయ్ బామ్మర్ది సినిమా కథకు నా మనసులో ఆలోచన మొదలైంది. ఇది 20 ఏళ్ల కిందటి మాట. నాకు తెలిసి ప్రతి స్క్రిప్టు సినిమాగా మారేందుకు కొంత టైమ్ తీసుకుంటుంది. కనీసం మూడేళ్లు ఒక స్క్రిప్ట్ దర్శకుడి దగ్గర ఉండిపోతుందని నా అంచనా. ఎందుకంటే సినిమా చేయాలంటే అన్నీ కుదరాలి. సివప్పు మంజల్ పచ్చై అనే పేరుతో తమిళ్ లో ఈ మూవీని రూపొందించాం. తెలుగులో రీమేక్ చేయాలనుకున్నా, కొన్ని కారణాల వల్ల కుదరలేదు. దాంతో డబ్ చేసి విడుదల చేస్తున్నాం. బిచ్చగాడు డబ్ వెర్షన్ తెలుగులో ఎంత పెద్ద హిట్ అయ్యిందో మీకు తెలుసు. ఒరేయ్ బామ్మర్ది కథ సిద్ధార్థ్ కు చెప్పాక తనను బావమరిది క్యారెక్టర్ చేయమని అడిగాను. కానీ సిద్ధార్థ్ కు బావ క్యారెక్టర్ నచ్చి అది సెలెక్ట్ చేసుకున్నాడు. బావమరిది క్యారెక్టర్ లో జీవీ ప్రకాష్ కుమార్ ని తప్ప మరొకరు సెట్ కారు అనిపించింది. సిద్ధార్థ్ చాలా డెడికేటెడ్ ఆర్టిస్ట్. జీవీ కూడా సూపర్బ్ గా యాక్ట్ చేశాడు. ఇందులో యాక్షన్ సీన్స్ బాగా కుదిరాయి. ఈ మూవీ మీకు తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నాను. అన్నారు.

Most Recommended Video

ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #gv prakash
  • #orey bavamaridi
  • #Siddarth

Also Read

Vishwanath and Sons Teaser: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టీజర్ రివ్యూ.. హిట్టు కళ కనిపిస్తుంది

Vishwanath and Sons Teaser: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టీజర్ రివ్యూ.. హిట్టు కళ కనిపిస్తుంది

Ustaad Bhagat Singh: ‘మైత్రి’ సెంటిమెంట్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి కలిసొస్తుందా?

Ustaad Bhagat Singh: ‘మైత్రి’ సెంటిమెంట్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి కలిసొస్తుందా?

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

related news

3BHK Collections: ప్లాప్ గా మిగిలిన సిద్దార్థ్ ‘3 BHK’

3BHK Collections: ప్లాప్ గా మిగిలిన సిద్దార్థ్ ‘3 BHK’

trending news

Vishwanath and Sons Teaser: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టీజర్ రివ్యూ.. హిట్టు కళ కనిపిస్తుంది

Vishwanath and Sons Teaser: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టీజర్ రివ్యూ.. హిట్టు కళ కనిపిస్తుంది

6 hours ago
Ustaad Bhagat Singh: ‘మైత్రి’ సెంటిమెంట్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి కలిసొస్తుందా?

Ustaad Bhagat Singh: ‘మైత్రి’ సెంటిమెంట్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి కలిసొస్తుందా?

9 hours ago
Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

1 day ago
Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

1 day ago
Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

2 days ago

latest news

Chadalavada Srinivasarao: సినిమాను బతికించుకోలేకపోతున్నాం… సీనియర్‌ నిర్మాత కామెంట్స్‌ వైరల్‌

Chadalavada Srinivasarao: సినిమాను బతికించుకోలేకపోతున్నాం… సీనియర్‌ నిర్మాత కామెంట్స్‌ వైరల్‌

2 hours ago
Sai Pallavi: స్టార్‌ బయోపిక్‌కి సాయిపల్లవి ఓకే చెప్పిందా? అదే జరిగితే ఇప్పట్లో సౌత్‌కి రానట్లే

Sai Pallavi: స్టార్‌ బయోపిక్‌కి సాయిపల్లవి ఓకే చెప్పిందా? అదే జరిగితే ఇప్పట్లో సౌత్‌కి రానట్లే

2 hours ago
Pawan Kalyan: టికెట్‌ రేట్ల పెంపు.. రెండు లాజిక్‌లు చెప్పిన పవన్‌ కల్యాణ్‌.. మీరు సమ్మతిస్తారా?

Pawan Kalyan: టికెట్‌ రేట్ల పెంపు.. రెండు లాజిక్‌లు చెప్పిన పవన్‌ కల్యాణ్‌.. మీరు సమ్మతిస్తారా?

2 hours ago
D56: నాన్‌ స్టాప్‌ ధనుష్‌ కొత్త సినిమా.. ఎన్టీఆర్‌ హీరోయిన్‌ని ఫిక్స్‌ చేశారా?

D56: నాన్‌ స్టాప్‌ ధనుష్‌ కొత్త సినిమా.. ఎన్టీఆర్‌ హీరోయిన్‌ని ఫిక్స్‌ చేశారా?

4 hours ago
Vijay – Jason Sanjay: విజయ్‌కి మరో షాక్‌ ఇవ్వబోతున్న కొడుకు.. సినిమా రిలీజ్‌ అయితే కానీ తెలియదు

Vijay – Jason Sanjay: విజయ్‌కి మరో షాక్‌ ఇవ్వబోతున్న కొడుకు.. సినిమా రిలీజ్‌ అయితే కానీ తెలియదు

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version