Aishwarya,Shankar: అసిస్టెంట్‌ డైరెక్టర్‌తో శంకర్‌ కుమార్తె నిశ్చితార్థం.. ఫొటోలు వైరల్‌!

ప్రముఖ దర్శకుడు శంకర్‌ పెద్ద కూతురు ఐశ్వర్య నిశ్చితార్థ వేడుక ఇటీవల ఘనంగా జరిగింది. ఆదివారం సాయంత్రం ఈ వేడుక జరిగినట్లు రెండో కూతురు అదితి ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా కొన్ని ఫొటోలు పంచుకున్నారు. శంకర్‌ దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేస్తున్న తరుణ్‌ కార్తికేయన్‌తో ఐశ్వర్య ఎంగేజ్‌మెంట్‌ జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. తరుణ్‌ కార్తికేయన్‌.. శంకర్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చాలా కాలంగా పనిచేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఇద్దరికీ పరిచయమైంది. ఆ పరిచయం ఇప్పుడు పెళ్లి వైపు తీసుకొచ్చింది అంటున్నారు. అయితే శంకర్‌ దగ్గరుండి ఈ పెళ్లిని కుదిర్చారు అంటున్నారు. తొలిసారి వివాహం విషయంలో పడ్డ ఇబ్బందులు గుర్తుపెట్టుకుని జాగ్రత్తలు తీసుకున్నారు అని చెబుతున్నారు. త్వరలోనే పెళ్లి తేదీ ఫిక్స్‌ చేసి వివరాలు వెల్లడిస్తారట. అలాగే వివాహ వేదిక విషయంలోనూ క్లారిటీ ఇస్తారట. వృత్తి రీత్యా ఐశ్వర్య డాక్టర్‌ కాగా… తరుణ్‌ కార్తికేయన్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ మాత్రమే కాదు.

పాటల రచయిత, ప్లే బ్యాక్‌ సింగర్‌ కూడా. శంకర్‌ (Shankar) దగ్గర చాలా ఏళ్లుగా సినిమాలకు పని చేస్తున్నారు. ప్రస్తుతం సెట్స్‌ మీద ఉన్న ‘భారతీయుడు 2’, ‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమాలకూ శంకర్‌ టీమ్‌లో తరుణ్‌ కార్తికేయన్‌ ఉన్నారట. ‘భారతీయుడు 2’ ఈ ఏడాదిలోనే విడుదల కానుండగా… ‘గేమ్‌ ఛేంజర్‌’ సంగతి తెలియడం లేదు. డేట్‌ విషయంలో క్లారిటీ అయితే రావడం లేదు. ఇక ఐశ్వర్య శంకర్‌కు మూడేళ్ల క్రితమే క్రికెటర్‌ రోహిత్‌ దామోదరన్‌తో వివాహం జరిగింది.

వీరి పెళ్లి వేడుక ఘనంగా నిర్వహించడమే కాకుండా గ్రాండ్‌ రిసెప్షన్‌ కూడా ప్లాన్‌ చేశారు. దీనికి పెద్ద ఎత్తున సెలబ్రిటీలను కూడా ఆహ్వానించారు. అంతలోనే ఆ పెళ్లిని రద్దు చేశారు. రోహిత్‌పై తన అకాడెమీలో వచ్చిన ఆరోపణలు, ఆ తర్వాత నమోదైన పోస్కో కేసే పెళ్లి రద్దుకు కారణమని సమాచారం. రోహిత్‌ ప్రముఖ వ్యాపారవేత్త కుమారుడు. ఆయనపై 16 ఏళ్ల బాలిక లైంగిక ఆరోపణలతో కేసు పెట్టింది.

భామా కలాపం 2 సినిమా రివ్యూ & రేటింగ్!

భ్రమయుగం సినిమా రివ్యూ & రేటింగ్!
రాజధాని ఫైల్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus