Shiva Nirvana: తెరపై వింటేజ్ సమంత చూస్తారు.. శివ నిర్వాణ కామెంట్స్ వైరల్!

  • August 31, 2023 / 06:55 AM IST

డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత విజయ్ దేవరకొండ హీరో హీరోయిన్లు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి చిత్రం ఖుషి. ఈ సినిమా సెప్టెంబర్ ఒకటవ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఇకపోతే తాజాగా డైరెక్టర్ శివ నిర్మాణ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నారు.

ఈ సందర్భంగా శివ నిర్వాణ మాట్లాడుతూ.. ప్రస్తుతం సమంత చాలా విభిన్నమైన జానర్ లో సినిమాలు చేస్తూ వస్తున్నారు. సమంత నుంచి ఒక అద్భుతమైన ఫీల్ గుడ్ లవ్ స్టోరీ వచ్చి చాలా కాలం అయిందని అందుకే ఖుషి సినిమా ద్వారా ఒక మంచి ప్రేమ కథ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలియజేశారు. ఇక ఈ సినిమాలో తెరపై ఒక వింటేజ్ సమంతను చూస్తారు అంటూ శివ నిర్వాణ తెలియజేశారు.

ఇప్పటివరకు తాను చేసినటువంటి లవ్ స్టోరీ సినిమాలు నిన్ను కోరి మజిలీ వంటి సినిమాలలో బ్రేకప్ స్టోరీలు మాత్రమే చూశారు. కానీ ఈ లవ్ స్టోరీ మాత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని తెలిపారు. ఇక ఈ సినిమాకి ఖుషి టైటిల్ పెట్టడానికి కారణం లేకపోలేదు ఈ సినిమా మొత్తం చాలా సరదాగా సాగిపోతుందని అయితే ఈ సినిమాని ఐదు భాషలలో విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో అన్ని భాషలలో ఒకే టైటిల్ ఉండాలన్న నేపథ్యంలోనే ఈ టైటిల్ ఎంపిక చేశామని తెలిపారు.

ఇక ఈ సినిమా మొత్తం సమంత నిజజీవిత ఆధారంగా చేసాము అంటూ వార్తలు వస్తున్నాయి అయితే ఇందులో ఏమాత్రం నిజం లేదని తెలిపారు. ఈ సినిమా కథకు సమంత నిజ జీవితానికి ఏమాత్రం పోలికలు కానీ, సంబంధం కానీ లేదని తెలిపారు. ఈ సినిమా సరికొత్తగా ఉంటుందని ప్రతి ఒక్కరికి తప్పకుండా నచ్చుతుంది అంటూ ఈ సందర్భంగా ఖుషి సినిమా గురించి డైరెక్టర్ శివా నిర్వాణ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?

మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus