‘పుష్ష 2’ (Pushpa: The Rule) వాస్తవానికి… ఆగస్టు 15న రిలీజ్ కావాలి. కానీ.. షూటింగ్ డిలే అవ్వడం వల్ల డిసెంబరు 6కి వాయిదా పడింది. సరే డిసెంబరు 6 కి అయినా రిలీజ్ అవుతుందా? అంటే కచ్చితంగా అవునని చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే మరో 40 రోజుల షూటింగ్ పార్ట్ బ్యాలెన్స్ ఉంది. అందులో ఫహాద్ ఫాజిల్ (Fahadh Faasil) ఎపిసోడ్స్ కి సంబంధించిన షూటింగ్ పార్ట్ మరో 25 రోజులు ఉన్నట్లు టాక్. సో బ్యాలెన్స్ షూటింగ్ కంప్లీట్ అవ్వాలంటే అనుకున్నదానికంటే కొంచెం ఎక్కువ టైమే పడుతుంది.
అందుకే సుకుమార్ (Sukumar) ఇప్పుడు తన పద్ధతి కొంచెం మార్చినట్లు తెలుస్తోంది. మేటర్ ఏంటంటే..హైదరాబాద్లో ‘పుష్ష 2’ షూటింగ్ నిర్వహిస్తున్నారు. అక్టోబరు చివరి వరకు షూటింగ్ జరుగుతుందట. అప్పుడు నవంబర్ నుండి పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టే ఛాన్స్ ఉంటుంది. ఇందుకోసం సుకుమార్ అదనంగా స్క్రిప్టులో కూడా పలు కీలక మార్పులు చేశాడట. పేపర్ పైనే కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేస్తే.. షూటింగ్ డేస్ తగ్గించొచ్చు. అలాగే నిర్మాతలకి ఎక్స్ట్రా డబ్బులు పెట్టాల్సిన పని ఉండదు.
అందుకే సుకుమార్ ఆ దిశగా పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే.. మరోపక్క సుకుమార్ పనితనం గురించి తెలిసిన వాళ్ళు.. అది జరిగే పని కాదు అంటున్నారు. ఎందుకంటే షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయినా సరే.. ‘కోడి గుడ్డు మీద ఈకలు వెతికినట్టు వెతుకుతుంటాడు సుకుమార్’ అని అంటున్నారు. రిలీజ్ ఇంకో 2 రోజుల్లో ఉంది అన్నా సరే.. ఈరోజు ప్యాచ్ వర్క్ షూటింగ్ చేస్తాడని చెబుతున్నారు. మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి.