Director Sukumar: ఆర్య 3 సినిమా పట్టాలెక్కేది అప్పుడేనా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో ఆర్య, ఆర్య2 సినిమాలు తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలలో ఆర్య బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిస్తే ఆర్య 2 ఒక వర్గం ప్రేక్షకులకు నచ్చినా కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. ప్రస్తుతం బన్నీతో పుష్ప సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న సుకుమార్ ఆర్య 3 సినిమాను కూడా తెరకెక్కించాలని భావిస్తున్నారని తెలుస్తోంది. తాజాగా సుకుమార్ ఆర్య 3 స్క్రిప్ట్ సిద్ధమవుతుందని చెప్పుకొచ్చారు.

త్వరలోనే ఆర్య 3 ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని సుకుమార్ కామెంట్లు చేశారు. అల్లు అర్జున్ పుష్ప పార్ట్1 షూటింగ్ పూర్తైన తర్వాత ఐకాన్ షూటింగ్ లో పాల్గొననున్నారు. వచ్చే ఏడాది సెకండాఫ్ లో పుష్ప పార్ట్2 షూటింగ్ మొదలు కానుందని తెలుస్తోంది. ఆర్య 3 సినిమాకు కూడా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించే అవకాశాలు అయితే ఉన్నాయి. సుకుమార్ దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమాలన్నీ మ్యూజికల్ హిట్లు అనే సంగతి తెలిసిందే.

ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో పుష్ప సినిమా తెరకెక్కుతుండగా ఫహద్ ఫాజిల్ మెయిల్ విలన్ గా నటిస్తున్నారు. సునీల్ కీలక పాత్రలో ఈ సినిమాలో నటిస్తుండగా బన్నీకి జోడీగా రష్మిక మందన్నా నటిస్తున్నారు. బన్నీ అల వైకుంఠపురములో ఇండస్ట్రీ హిట్ తర్వాత సినిమాల ఎంపిక విషయంలో చాలా మారారు. పుష్ప పార్ట్1తో మరో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో చేరుతుందని అల్లు అర్జున్ అనుకుంటున్నారు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు దక్కుతుందని బన్నీ భావిస్తున్నారు. మరో నాలుగేళ్ల తర్వాత ఆర్య 3 సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి.

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus