డైరక్టర్ తేజ చాలా కాలం తర్వాత నేనే రాజు నేనే మంత్రి సినిమాతో హిట్ అందుకున్నారు. దీంతో అతని దర్శకత్వంలో మంచి ప్రేమ కథ చిత్రం చేయాలనీ యువ హీరోలు భావిస్తున్నారు. అయితే తేజ మాత్రం మెగా హీరో కోసం కథ సిద్ధం చేసినట్లు తెలిసింది. లోఫర్, మిస్టర్ సినిమాల అపజయాలతో నిరాశలో ఉన్న వరుణ్ తేజ్ కూడా ఫిదా మూవీతో హిట్ ట్రాక్ లోకి వచ్చారు. ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఒక మూవీ చేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్లో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
లండన్లోని అందమైన లొకేషన్లలో హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ రాశీఖన్నాలపై రొమాంటిక్ సన్నివేశాలను వెంకీ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా తర్వాత తేజ దర్శకత్వంలో నటించాడని వరుణ్ ఉత్సాహం చూపిస్తున్నట్లు తెలిసింది. మరి ఈ సినిమా ప్రేమకథ, లేకుంటే పొలిటికల్ డ్రామానా? అనేది తెలియాల్సి ఉంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.