Trivikram, Parvati Melton: త్రివిక్రమ్ గట్టిగా ట్రై చేసినా ఆమెను గట్టెక్కించ లేకపోయాడట..?

త్రివిక్రమ్ శ్రీనివాస్.. రచయితలకు స్టార్ స్టేటస్ తీసుకొచ్చిన వ్యక్తి. ఒక సినిమాకు హీరో, హీరోయిన్లు, దర్శకుడే కాదు రచయిత కూడా కీలకమని నిరూపించాడు. ఆయన డైలాగ్స్ ఆలోచింపచేస్తూ.. తూటాల్లా పేలుతుంటాయి. స్టార్ రైటర్‌గా వున్న సమయంలోనే మెగా ఫోన్ పట్టి డైరెక్టర్‌గాను ఇమేజ్ సొంతం చేసుకున్నారు. త్రివిక్రమ్‌తో సినిమా చేసేందుకు స్టార్లు ఎప్పుడూ రెడీగానే వుంటారు. ఇకపోతే తన సినిమాల్లో మాటలు, హీరో ఎలివేషన్, కథతో పాటు హీరోయిన్‌కి కూడా ప్రత్యేక స్థానం కల్పిస్తారు త్రివిక్రమ్.

అతడు నుంచి నిన్న మొన్నటి అల వైకుంఠపురం వరకు హీరోలతో సమానంగా హీరోయిన్ పాత్రను అద్భుతంగా తీర్చిదిద్దారాయన. ఆయన సినిమాల్లో నటించిన నాయికలు స్టార్లుగా దున్నేస్తూ వుంటారు. త్రిష, అనుష్క, ఇలియానా, సమంత, పూజా హేగ్డేలు ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇలా త్రివిక్రమ్‌పై గంపెడాశలు పెట్టుకున్న ఓ హీరోయిన్ ఆ తర్వాతి కాలంలో అడ్రస్ లేకుండా పోయింది. ఆమె ఎవరో కాదు పార్వతి మెల్టన్. తొలుత గేం అనే సినిమాలో నటించిన పార్వతి మెల్టన్ ఆ తర్వాత అల్లరే అల్లరి, మధుమాసం లాంటి సినిమాల్లో కనిపించింది.

కానీ హీరోయిన్‌గా ఆమెకు ఎలాంటి బ్రేక్ రాలేదు. ఈ సమయంలో పవన్‌తో తీసిన జల్సాలో త్రివిక్రమ్ అవకాశం ఇచ్చారు. అయితే ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ పాత్ర కావడం.. క్రెడిట్ మొత్తం ఇలియానాకే దక్కడంతో పార్వతికి మార్కులు పడలేదు. తర్వాత శ్రీమన్నారాయణ, యమహో యమా అనే సినిమాలు చేసినా అవి ఆడలేదు. దీంతో తెలుగు తెరకు క్రమేణా దూరమై పెళ్లి చేసుకుని సెటిలైంది. ప్రస్తుతం సీనియర్ హీరోయిన్స్ అంతా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడంతో పార్వతి కూడా మరోసారి తెలుగువారిని పలకరిస్తుందేమో వేచి చూడాలి.

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus