Venky Atluri, Balakrishna: వెంకీ – బాలయ్య కాంబో.. అసలు మేటర్ అది..!

  • August 30, 2024 / 01:46 PM IST

నందమూరి బాలకృష్ణ (Balakrishna) ప్రస్తుతం బాబీ  (Bobby)  దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) తర్వాత బాబీ డైరెక్ట్ చేస్తున్న మరో మాస్ యాక్షన్ డ్రామా ఇది. బాలకృష్ణ కెరీర్లో 109వ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ  (Suryadevara Naga Vamsi) నిర్మిస్తున్నారు. ‘అసురుడు’ అనే టైటిల్ ను ఈ సినిమా కోసం అనుకుంటున్నారు. మరోపక్క ఈ సినిమా పూర్తయ్యాక బాలకృష్ణ నెక్స్ట్ సినిమా ఏ డైరెక్టర్ తో ఉంటుంది అనే చర్చ కూడా జరుగుతుంది.

Venky Atluri, Balakrishna

ఈ క్రమంలో వెంకీ అట్లూరి దర్శకత్వంలో బాలయ్య నెక్స్ట్ సినిమా చేయబోతున్నట్లు అంతా చర్చించుకుంటున్నారు. అందులో ఎంత మాత్రం నిజం లేదు. వెంకీ అట్లూరి (Venky Atluri) దర్శకత్వంలో బాలయ్య చేస్తున్నది ఓ యాడ్ మాత్రమే..! అవును.. వెంకీ అట్లూరి దర్శకత్వంలో బాలయ్య.. ఓ యాడ్లో నటిస్తున్నారు. దానికి సంబంధించిన ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో బాలయ్య చాలా ట్రెడిషనల్ గా కనిపిస్తున్నాడు.

విగ్ కానీ, డ్రెస్సింగ్ కానీ.. అంతా బాగా సెట్ అయ్యింది. బాలయ్య ఏజ్ కూడా ఓ 5 ఏళ్ళు వెనక్కి వెళ్లిన ఫీలింగ్ ఇచ్చింది ఈ పిక్. ఇక ఈ యాడ్లో బాలకృష్ణకు జోడీగా హీరోయిన్ సంయుక్త మీనన్ నటిస్తుందట. ఇక వెంకీ అట్లూరి కూడా ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ లో లక్కీ భాస్కర్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దీపావళి కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుంది.

పాన్ ఇండియా సినిమాల విషయంలో ఇన్ని జాగ్రత్తలా.. సక్సెస్ సీక్రెట్ ఇదేనా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus