టాలెంటెడ్ డైరెక్టర్ వేణుశ్రీరామ్ ఇప్పటివరకు తన కెరీర్ లో మూడు సినిమాలను తెరకెక్కించాడు. అవే ‘ఓ మై ఫ్రెండ్’, ‘ఎంసీఏ’, ‘వకీల్ సాబ్’. ఈ సినిమాల్లో రెండు మంచి హిట్స్ అందుకున్నాయి. ఈ మూడు సినిమాలను కూడా దిల్ రాజు తన సొంత బ్యానర్ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించారు. ‘రీసెంట్ గా విడుదలైన ‘వకీల్ సాబ్’ సినిమా భారీ విజయాన్ని నమోదు చేయడంతో వేణుశ్రీరామ్ తదుపరి సినిమా కూడా తన బ్యానర్ లోనే ఉంటుందని దిల్ రాజు అనౌన్స్ చేశాడు.
ఈ క్రమంలో ‘ఐకాన్’ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్లు వార్తలు ఊపందుకున్నాయి. అలానే వేరే హీరోలకు కూడా వేణు కథలను చెబుతున్నట్లు టాక్స్ మొదలయ్యాయి. కానీ వేణుశ్రీరామ్ మాత్రం తన తదుపరి సినిమా దిల్ రాజుతో చేయబోతున్నట్లు ఎక్కడా చెప్పలేదు. లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం.. వేణుశ్రీరామ్ దిల్ రాజు కాంపౌండ్ నుండి బయటకొచ్చేసినట్లు తెలుస్తోంది. రీసెంట్ గా జరిగిన కొన్ని సంఘటనల కారణంగా వేణుశ్రీరామ్ విసిగిపోయారని.. ఆ కారణంగానే ఆయన బయటకొచ్చేసినట్లు చెబుతున్నారు.
ఇటీవల ఓ స్టార్ హీరోని కలిసిన వేణుశ్రీరామ్ తన కథతో ఇంప్రెస్ చేసినట్లు సమాచారం. అయితే ఈ సినిమా దిల్ రాజు బ్యానర్ లో ఉండదట. కొన్ని అగ్ర నిర్మాణ సంస్థలు వేణుశ్రీరామ్ ను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ ఈ విషయంపై ఈ దర్శకుడు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదట. ఒక్కసారి బడ్జెట్, రెమ్యునరేషన్స్ ఫిక్స్ అయితే అప్పుడు తన డెసిషన్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేయాలని భావిస్తున్నాడు.