Vetrimaaran, Jr NTR: ఎన్టీఆర్ అభిమానులకు మంచి కిక్ ఇచ్చే న్యూస్ చెప్పిన వెట్రిమారన్!

  • April 12, 2023 / 01:36 PM IST

‘వెట్రిమారన్’ తమిళంలో తిరుగులేని స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు. మన తెలుగు హీరోలతో చాలా కాలంగా సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ తో సినిమా పక్కా అంటూ చాలా ప్రచారం జరిగింది. ఫైనల్ గా ధనుష్ – ఎన్టీఆర్ కాంబినేషన్లో వెట్రిమారన్ ఓ పవర్ ఫుల్ మల్టీస్టారర్ రూపొందిస్తున్నట్టు కూడా కామెంట్లు వినిపించాయి. తాజాగా ‘విడుదల: పార్ట్ 1′(తమిళంలో విడుదలై 1) చిత్రం ప్రమోషన్లో ఎన్టీఆర్ సినిమా పై స్పందించి క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు వెట్రిమారన్.

వెట్రిమారన్ (Vetrimaaran) మాట్లాడుతూ.. “ఆడుకాలం తర్వాత నేను అల్లు అర్జున్ ఒకటి రెండు సార్లు కలిశాం. ‘నేను తమిళంలో సినిమా చేయాలనుకుంటున్నాను. మీకు ఆసక్తి ఉంటే కథ చెప్పండి’ అని బన్నీ అడిగాడు. అప్పుడు నేను రాసుకున్న ‘వడ చెన్నై’లో ఓ పవర్ఫుల్ పాత్ర గురించి ఆయనకు చెప్పాను. కానీ, ఎందుకో అది కుదరలేదు. మొదట అనుకున్న వెర్షన్లో ఆ పాత్ర ఉంది. ఆ తర్వాత మార్పులు చేశాం.

అదే సమయంలో మహేష్ బాబు ను కూడా కలిసి ఒక కథ చెప్పాను. ఎందుకో ఆ సినిమా కూడా కార్యరూపం దాల్చలేదు. ‘అసురన్’ మూవీ తర్వాత, లాక్ డౌన్ అనంతరం  ఎన్టీఆర్ ను కలిశాను. అనేక విషయాలు మేమిద్దరం మాట్లాడుకోవడం జరిగింది. ఆయనతో ఓ సినిమా చేసే అవకాశం ఉంది. కానీ, అందుకు చాలా టైం పట్టొచ్చు. అది సోలో హీరో మూవీనా, మల్టీస్టారరా? అన్న విషయం కాలమే నిర్ణయిస్తుంది.

అలాగే, ఏ కాంబినేషన్ లో ఎలాంటి మూవీ రావాలన్న దానిపై కూడా నాకు స్పష్టత ఉంది. స్టార్ వాల్యూ, కాంబినేషన్ వాల్యూ కాకుండా మేము ఎంచుకునే కంటెంట్ ఫలానా స్టార్ కావాలని డిమాండ్ చేస్తే అతనితో సినిమా చేస్తా” అంటూ ఆయన చెప్పుకొచ్చాడు.

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus