H Vinoth: ‘జన నాయగన్‌’లో ఏఐ ఫైట్‌.. డైరక్టర్‌ వినోద్‌ క్లారిటీ

‘జన నాయగన్‌’ సినిమా విషయంలో అభిమానులకు విజయ్‌ హైలైట్‌ కాగా, మిగిలినవాళ్లకు మరికొన్ని అంశాలు హైలైట్‌గా నిలిచాయి. యాక్షన్‌, టెక్నాలజీ అంటే ఇష్టం ఉన్నవారికి ఓ రెండు అంశాలు టాప్‌ ఆఫ్‌ ది సినిమాగా నిలిచాయి. అవే డ్రోన్‌ వార్‌, రెండోది రోబోలు. సినిమా రెండు కీలక సమయాల్లో ఇవి కనిపిస్తాయి. సినిమాకు ఇవి ఎంతవరకు పనికొచ్చాయి అనేది తెలియదు కానీ.. ఏఐ వినియోగం స్పీడులో ఉన్న యువతకు ప్రత్యేక ఆకర్షణగా మాత్రం నిలిచాయి. మరోవైపు విమర్శలు కూడా వచ్చాయి.

H Vinoth

వీటిపై దర్శకుడు హెచ్‌.వినోద్‌ స్పందించారు. సినిమాలో ఏఐ వినియోగం, ఏఐ వినియోగించి చిత్రీకరించిన ఫైట్ల గురించి కూడా మాట్లాడారు. ఉక్రెయిన్‌ – రష్యా యుద్ధం సమయంలో డ్రోన్స్‌, రోబోటిక్‌ డాగ్స్‌ వినియోగించారు. వాటి గురించి తెలిశాక సినిమాలో ఎందుకు వినియోగించకూడదు అనిపించింది. ఆ ఆలోచనకు ఇంకాస్త ఎక్కువగా ఆలోచించింది రోబోలతో ఫైట్‌ ఉంటే ఎలా ఉంటుంది అనే ఆలోచన చేశాను. అదే ఇప్పుడు సినిమాలో చూస్తున్న రోబోలతో ఫైట్‌ అని వినోద్‌ చెప్పారు.

ఇప్పుడు చూస్తే.. చైనా హ్యూమనాయిడ్‌ రోబోలను తయారు చేస్తున్నాయి అని గుర్తు చేశారు దర్శకుడు వినోద్‌. ఇక సినిమా తెరకెక్కడంతో ఏఐ గురించి మాట్లాడుతూ… సినిమాను తెరకెక్కించడంలో ఏఐ చాలా చోట్ల ఉపయోగపడుతోంది. దీని వల్ల సినిమా బడ్జెట్‌, నిర్మాణ సమయం రెండూ కలిసి వస్తాయి అని చెప్పారు. అలాగే ‘జన నాయగన్‌’లోని ఆఫ్రికా నేపథ్యంలోని ఫ్లాష్‌ బ్యాక్‌ ఏఐతోనే రూపొందించాం అని చెప్పారు. సినిమాను తెరకెక్కించడంలో ఏఐ ప్రమేయంపై ఆందోళన వ్యక్తం చేస్తున్న దర్శకులు ఉన్న రోజుల్లో ఇలా పాజిటివ్‌గా మాట్లాడటం ఆసక్తిరేకెత్తించే విషయమే.

ఇక ‘జన నాయగన్‌’ సినిమా విషయానికొస్తే.. తొలి రెండు రోజుల్లో ఈ సినిమా ప్రపంవ్యాప్తంగా సుమారు రూ.110 కోట్లు వసూలు చేసింది. అయితే చిత్రబృందం ఈ విషయంలో అధికారికంగా వసూళ్ల వివరాలు వెల్లడించలేదు.

 ‘రామాయణ’కు ‘ఆదిపురుష్‌’ భయం పట్టుకుందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus