VN Aditya: సింగర్ సునీత పై సీనియర్ దర్శకుడు వి.ఎన్.ఆదిత్య ఫన్నీ సెటైర్లు

  • December 20, 2023 / 08:36 PM IST

టాలీవుడ్ స్టార్ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ అయిన సునీత అందరికీ సుపరిచితమే. ఈమె కొడుకు ఆకాష్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. కె.రాఘవేంద్రరావు గారి నిర్మాణంలో గంగనమోని శేఖర్ డైరెక్ట్ చేస్తున్న ‘సర్కారు నౌకరి’ అనే సినిమాతో ఇతను హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. డిసెంబర్ 1 న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఆల్రెడీ టీజర్, పాటలు రిలీజ్ అయ్యాయి. తాజాగా ట్రైలర్ ను కూడా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈవెంట్లో సునీత కూడా పాల్గొన్నారు.

తన కొడుకు సినిమాని ఈ విధంగానే ఆమె దగ్గరుండి ప్రమోట్ చేస్తుంది. ఇదిలా ఉండగా.. ఈ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా సీనియర్ దర్శకులు వి.ఎన్.ఆదిత్య పనిచేశారు. ఇక ఈ వేడుకలో ఆయన స్పీచ్ ఇస్తూ.. సునీత పై ఆయన ఫన్నీ సెటైర్లు విసిరారు. ఆయన స్పీచ్ లో భాగంగా.. ‘గతేడాది ‘సీతా రామం’ అనే హిట్టు సినిమా వచ్చింది. అయితే దానికంటే ముందు వచ్చిన ‘సునీతా రామం’ అనే సినిమా ఇంకా పెద్ద హిట్టు’ అంటూ ఆయన (VN Aditya) చెప్పుకొచ్చారు.

దీనికి అక్కడున్న వారంతా తెగ నవ్వుకున్నారు అని చెప్పాలి. 2021 లో సునీత .. మ్యాంగో మీడియా అధినేత రామ్ వీరపనేనిని రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పిల్లలు పెద్దవాళ్ళు అయిన టైంలో రెండో పెళ్లి చేసుకోవడం ఏంటి అంటూ అప్పుడు ఆమెను చాలా మంది తప్పుబట్టారు. దీంతో ఆమె రెండో పెళ్లి సంచలనం సృష్టించింది. అయితే ఆమె తన పిల్లల కెరీర్ ను చక్కదిద్దడం కోసమే అలా చేసినట్టు తర్వాత అందరూ అర్ధం చేసుకున్నారు.

మహేష్, చరణ్..లతో పాటు ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాని హీరోల లిస్ట్

‘హాయ్ నాన్న’ నుండి ఆకట్టుకునే 18 డైలాగులు ఇవే..!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ నుండి ఆకట్టుకునే 20 డైలాగులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus