పూరి vs డిస్ట్రిబ్యూటర్స్‌… నెక్స్ట్‌ స్టెప్‌ కోర్టేనా?

‘లైగర్‌’ సినిమా విషయంలో పూరి జగన్నాథ్‌ వర్సెస్‌ డిస్ట్రిబ్యూటర్లు/ ఎగ్జిబిటర్ల వివాదం కొత్త మలుపు తీసుకోనుందా? అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఈ విషయంలో అగ్రెసివ్‌గా ఉన్న పూరికి తగ్గట్టుగా డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు కూడా ఓ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. క్లియర్‌గా చెప్పాలంటే ‘లైగర్‌’ పంచాయితీ విషయంలో కోర్టు మెట్లు ఎక్కాలని నిర్ణయించుకున్నట్లు వార్తలొస్తున్నాయి. దీనిపై అధికారిక సమాచారం లేదు కానీ.. ఆ దిశగా అడుగులు అయితే పడుతున్నాయి అంటున్నారు.

‘లైగర్‌’ సినిమా పరాజయంతో దర్శకుడు పూరి జగన్నాథ్‌ చిక్కుల్లో పడ్డారు. ఆ సినిమా ఫలితం వల్ల ఆర్థికంగా నష్టపోయామని, డబ్బులు తిరిగి చెల్లించాలంటూ కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు బెదిరింపులకు పాల్పడుతున్నారని పూరి జగన్నాథ్‌ ఇటీవల జూబ్లీహిల్స్‌ పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తనకు ప్రాణ హాని ఉందని, తన కుటుంబానికి రక్షణ కల్పించాలంటూ పూరి ఫిర్యాదు చేశారు. దీంతో పూరి నివాసం వద్ద పోలీసులు గురువారం భద్రత కల్పించారు. విజయ్‌ దేవరకొండ హీరోగా పూరి తెరకెక్కించిన ‘లైగర్‌’ భారీ అంచనాలతో విడుదలై ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయింది.

నైజాం డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శీను, ఫైనాన్షియర్ శోభన్ బాబు.. తాము నష్టపోయిన డబ్బులు తిరిగి చెల్లించాలని పూరిపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. సినిమా వల్ల సుమారు రూ.8 కోట్ల వరకు నష్టపోయామని.. ఆ డబ్బులు తిరిగి ఇప్పించాలంటూ పూరికి లేఖలు రాశారని సమాచారం. అయితే ఈ విషయంలో పూరి టీమ్‌ నుండి ఓ ఆడియో ఫైల్‌ బయటకు వచ్చింది. రెండు రోజుల క్రితం వచ్చిన ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

అక్టోబరు 27న డిస్ట్రిబ్యూటర్‌, ఎగ్జిబిటర్లు పూరి ఇంటి ముందు ధర్నా చేయబోతున్నారని, తన పరువు తీసేందుకు కుట్ర చేస్తున్నారని ఆ వీడియోలో పూరి వాపోయారు. ఈ ఆడియో బయటకు వచ్చిన కొద్ది రోజులకు పూరి పోలీసులను ఆశ్రయించారు. అయితే ప్రస్తుతం పూరి జగన్నాథ్‌ హైదరాబాద్‌లో లేరట. దీంతో డిస్ట్రిబ్యూటర్లు ఎవరూ ఆయన ఇంటిని 27న ముట్టడించలేదని సమాచారం. అయితే ఈ విషయంలో పూరి పోలీసుల దగ్గరకు వెళ్లడంతో.. ‘లైగర్‌’ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని బాధిత డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు యోచిస్తున్నట్టు సమాచారం.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus