Rajamouli: ‘ఆర్.ఆర్.ఆర్’ సీక్వెల్ రాజమౌళి నోరు మెదిపాడు.. కానీ..!

ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతుంది. ఇందులో దర్శకుడు రాజమౌళితో రాంచరణ్ (Ram Charan), ఎన్టీఆర్ (Jr NTR) కలిసి సందడి చేశారు. సరదాగా రాజమౌళిని (S. S. Rajamouli) ఆటపట్టించారు. లండన్ లోని రాయల్ ఆల్బర్ట్ హాల్ లో లైవ్ కాన్సర్ట్ అనంతరం వీళ్ళు బస చేసిన హోటల్ రూమ్లో వీళ్ళు కలుసుకుని ‘ఆర్.ఆర్.ఆర్’  (RRR Movie) జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు అని తెలుస్తుంది. ఈ క్రమంలో ‘ ‘ఆర్ఆర్ఆర్ 2’ ఎప్పుడు చేస్తారు అంటూ ఒక వ్యక్తి వారిని అడగడం జరిగింది.

Rajamouli

అందుకు రాజమౌళి ‘ఎస్ తప్పకుండా చేస్తాం’ అని సమాధానమిచ్చారు. రాజమౌళి అలా చెప్పడం అభిమానులకి మంచి కిక్ ఇచ్చింది అనే చెప్పాలి. అందుకే ఈ వీడియోని వారు తెగ వైరల్ చేసేస్తున్నారు. ‘ఆర్.ఆర్.ఆర్’ కి సీక్వెల్ ఉంటుందని రాజమౌళి కంటే ముందుగా ఆయన తండ్రి విజయేంద్రప్రసాద్ చెప్పడం జరిగింది. కాకపోతే ఇప్పుడు ఎన్టీఆర్ ‘దేవర 2’ తో పాటు ‘వార్ 2’ (War 2)  ‘డ్రాగన్’ వంటి సినిమాల్లో నటిస్తున్నాడు. మరోపక్క రామ్ చరణ్ ‘పెద్ది’ (Peddi)  చేస్తున్నాడు.

తర్వాత ‘యూవీ క్రియేషన్స్’ లో ఒక సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు. తర్వాత సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయాలి. సో ఈ ఇద్దరు హీరోలు కమిట్ అయిన ప్రాజెక్టులు కంప్లీట్ చేయాలంటే.. మరో 3,4 ఏళ్ళు టైం పడుతుంది. మరోపక్క మహేష్ బాబుతో (Mahesh Babu) రాజమౌళి చేస్తున్న సినిమా కంప్లీట్ అవ్వాలన్నా.. ఇంకో 2 ఏళ్ళు టైం పట్టొచ్చు. కాబట్టి ‘ఆర్.ఆర్.ఆర్ 2’ ఇప్పట్లో తెవిలే వ్యవహారం కాదు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus