హౌస్‌ మేట్స్‌ గురించి దివి చెప్పింది కరెక్టేనా?

  • September 16, 2020 / 01:54 PM IST

మూడు రోజుల బిగ్‌బాస్‌ ఎపిసోడ్స్‌ చూసినవాళ్లందరికీ వచ్చే అనుమానం అసలు దివి ఇంట్లో ఉందా అని. ఎవరి పక్కనో అలా కూర్చోవడం లేదంటే ఎవరైనా మాట్లాడుతుంటే వినడం తప్ప దివి పెద్దగా ఎక్కడా యాక్టివ్‌గా కనిపించింది లేదు. దీంతో సోషల్‌ మీడియాలో దివి మీద మీమ్స్‌ పెరిగిపోతూ వస్తున్నాయి. ఫర్నిచర్‌లో దివి కలిసిపోయింది అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఈ విషయం బిగ్‌బాస్‌ వరకు వెళ్లిందో లేక ఆమెకే అర్థమైందో కానీ.. దివి ఈ రోజు మాట్లాడింది.

అదీ అలా ఇలా కాదు.. ఇంట్లో వాళ్లపై తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేసింది. ఇంట్లో అందరి గురించి చెప్పిందేమో కానీ… ప్రోమోలో మాత్రం కొంతమందివే చూపిస్తున్నారు. చేతిలో కార్డు ఉండటం బట్టి ఇది టాస్క్‌ అయ్యిఉండొచ్చన అని తెలుస్తోంది. ఏదైతేముంది దివి అయితే ఓపెన్‌ అయ్యింది. ‘నా మాటే విను అనడం కొంచెం తగ్గించడం మంచిది’ అని సూర్యకిరణ్‌కు దివి సూచించింది. అయితే దానికి ఆయన రియాక్షన్‌ కొంచెం కోపంగా ఉన్నట్లు అనిపిస్తోంది.

 

అయితే ఇది ప్రోమో కోసం చేసిన కట్‌ అని సులభంగా అర్థమవుతోంది. ‘కొన్నికొన్నిసార్లు మార్చుకుంటే బాగుంటుంది’ అని అఖిల్‌కు సూచిస్తే… అఖిలేమో ‘బాబోయ్‌’ అన్నట్లుగా రియాక్ట్‌ అయ్యాడు. ‘మీరు చిన్న చిన్నవాటికి కూడా ఏడ్చేస్తున్నారు. దీని వల్ల రేపొద్దున ఏదైనా సీరియస్‌ ఇష్యూ వస్తే ఏడిస్తే ఎవరూ పట్టించుకోరు’ అని మోనాల్‌ గురించి చెప్పింది. లాస్యను మీరు చాలా సెన్సిటివ్‌ అని తెగేసి చెప్పింది దివి. ఒక్క దివినే ఇలా చెప్పిందా? బిగ్‌బాస్‌ అందరితో చెప్పించాడా అనేది ఈ రోజు తెలుస్తుంది.

బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
బిగ్‌బాస్‌ 4 హైలెట్స్: బిగ్‌బాస్‌ ఇలా రోజూ అయితే కష్టమే!
బిగ్‌బాస్‌ 4: ఇంట్లో వాళ్లు ఒకరు… బయటి నుంచి ముగ్గురట!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus