Chiru,Balayya: సంక్రాంతికి అనుకుంటే.. దీపావళికే వార్ ఉందిగా!

వచ్చే ఏడాది సంక్రాంతికి మెగా వర్సెస్‌ నందమూరి ఉంటుందా? గత కొన్ని రోజులుగా ఈ విషయమ్మీద చర్చ నడుస్తోంది. సంక్రాంతి సీజన్‌ వదులుకోవాలని నందమూరి బాలకృష్ణ అనుకోవడం లేదని.. కచ్చితంగా 2023 పొంగల్‌ ఫైట్‌కి గోపీచంద్‌ మలినేని సినిమాను బరిలోకి దింపాలని అనుకుంటున్నాడని టాక్‌ నడుస్తోంది. అయితే అప్పటికే చిరంజీవి – బాబీల ‘వాల్తేరు వీరయ్య’ (టైటిల్‌ అధికారికంగా ప్రకటించలేదు) సినిమా సంక్రాంతి బరిలో ఉందని ప్రకటించేశారు. అయితే అప్పుడు వార్‌ ఉందో లేదో తెలియదు కానీ.. దీపావళికి పక్కాగా ఉంది అంటున్నారు.

దీపావళి సందర్భంగా.. కొత్త సినిమాల పోస్టర్లు, వీడియోలు పక్కాగా వస్తాయి. సంక్రాంతి సినిమాలకు సంబంధించి కచ్చితంగా ఆ రోజు అప్‌డేట్లు వస్తాయి. దాంతోపాటు డిసెంబరులో వచ్చే సినిమాల అప్‌డేట్లు కూడా వస్తాయి. అలా దీపాల పండగనాడు ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణ – గోపీచంద్‌ మలినేని సినిమాల ఫస్ట్‌లుక్‌, టైటిల్‌, వీడియోల వార్‌ ఉండబోతోందని టాక్‌. ఈ సినిమాలకు సంబంధించి అప్‌డేట్స్‌ వచ్చేలా చూస్తున్నారని టాక్‌. ‘వాల్తేరు వీరయ్య’ సినిమాకు సంబంధించి ఇప్పటికే దేవిశ్రీప్రసాద్‌ ఈ విషయంలో క్లారిటీ ఇచ్చాడు.

దీపావళి టీజర్‌ అదిరిపోయింది అంటూ దర్శకుడు బాబీని ప్రస్తావిస్తూ ట్వీట్‌ చేసి.. హింట్‌ ఇచ్చేశాడు. ఇక బాలకృష్ణ — గోపీచంద్‌ మలినేని సినిమా టీజర్‌ కూడా రెడీ అవుతోంది అని సమాచారం. దీంతో దీపావళికి మెగా పటాస్‌లు పేలుతాయా? లేక నందమూరి పటాకా పేలుతుందా? అనేది చూడాలి. అభిమానులు అయితే ఎవరి హీరో టీజర్‌ వారికి నచ్చుతుంది మరి సగటు ప్రేక్షకుడికి ఏది నచ్చుతుందో చూడాలి. రెండూ మాస్‌ సినిమాలే, కమర్షియల్‌ అంశాలు బలంగా ఉన్న చిత్రాలే కావడం గమనార్హం.

బాలయ్య – గోపీచంద్‌ మలినేని సినిమాకు సంబంధించి ఇప్పటికే ఓ వీడియో వచ్చి మంచి రెస్పాన్స్‌ సంపాదించుకుంది. ఇప్పుడు టీజర్‌తో ఏం చేస్తారో చూడాలి. ఇక చిరంజీవి సినిమా విషయానికొస్తే కేవలం టీజర్‌ పోస్టర్‌ మాత్రమే వచ్చింది. సినిమా టైటిల్‌ చిరంజీవి లీక్‌ చేసేశారు. బాలయ్య సినిమాకు ‘రెడ్డిగారు’, ‘అన్నగారు’, ‘జై బాలయ్య’ లాంటి పేర్లు పరిశీలనలో ఉన్నాయి.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus