బేబీ షామిలి అందరికీ సుపరిచితమే. చైల్డ్ ఆర్టిస్ట్ గా అంజలి సినిమాతో ఈమె సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత జగదేకవీరుడు అతిలోకసుందరి, కిల్లర్ వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. ఆ సినిమాల్లో తన ముద్దు ముద్దు మాటలతో ఈమె అందరి మనసుల్లో చెరగని ముద్ర వేసుకుంది. ఇక షామిలి నటించిన జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాలో ఆమె అక్క షాలిని కూడా నటించిన సంగతి తెలిసిందే. షాలిని కూడా సఖి, అద్బుతం వంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.
పెళ్లయ్యాక ఆమె సినిమాలకి దూరమైంది. అయితే షామిలి 2000 సంవత్సరం తర్వాత ఒక్క సినిమాలో కూడా నటించింది లేదు. 2009 లో సిద్దార్థ్ హీరోగా వచ్చిన ఓయ్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో ఆమె నటన ఆకట్టుకుంది .. కానీ లుక్స్ యూత్ ని ఆకర్షించేలా లేవు అని మేకర్స్ ఈమెను ఎంకరేజ్ చేయలేదు. కానీ ఓయ్ సినిమా కొంతవరకు బాగానే ఆడింది. ఓ క్లాసిక్ మూవీగా నిలిచింది.
మళ్లీ 9 ఏళ్ళ గ్యాప్ తర్వాత నాగశౌర్య హీరోగా నటించిన అమ్మమ్మగారిల్లు అనే సినిమాలో కూడా హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా ఓపెనింగ్స్ పరంగా ఓకె అనిపించింది కానీ తర్వాత ఫ్లాప్స్ లిస్ట్ లో చేరిపోయింది. దీంతో షామిలి సినిమాలకి పూర్తిగా గుడ్ బై చెప్పేసినట్టు అయ్యింది.ప్రస్తుతం ఆమె పెయింటింగ్స్ ఎగ్జిబిషన్ ను హోస్ట్ చేస్తుంది. ఆమెలో మంచి పెయింటర్ ఉంది. తన (Shamlee) టాలెంట్ ను బయటపెట్టి హ్యాపీ లైఫ్ ను జీవిస్తుంది.