నందమూరి తారకరత్న అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఫిబ్రవరి 18వ తేదీ తుది శ్వాస విడిచిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈయన మరణ వార్త ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పాలి ఇండస్ట్రీలో కొనసాగుతూనే రాజకీయాలలోకి వెళ్లిన ఈయన నారా లోకేష్ పాదయాత్రలో భాగంగా తనకు మద్దతు తెలుపుతూ పాల్గొన్నారు. ఇలా పాదయాత్ర ప్రారంభమైన కొంత సమయానికి తారకరత్న ఉన్నఫలంగా గుండెపోటుకు గురై స్పృహ తప్పి పడిపోయారు.
ఇలా ఈయన స్పృహ తప్పి పడిపోవడంతో తనని ప్రాథమిక చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించి అనంతరం మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయకు తరలించారు.అయితే నారాయణ హృదయాలయాలో దాదాపు 23 రోజులపాటు వెంటిలేటర్ పై చికిత్స తీసుకుంటున్నప్పటికీ ఈయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది.
ఇలా ఈయన ఆరోగ్య విషయంలో ఏమాత్రం మెరుగుపడకపోవడమే కాకుండా రోజురోజుకు మరింత క్షీణించడంతో ఈయన ఫిబ్రవరి 18వ తేదీ తుది శ్వాస విడిచారు.ఇక తారకరత్న మరణించడంతో ఆయనకు సంబంధించిన ఎన్నో విషయాల గురించి ప్రస్తుతం చర్చలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే తారకరత్న చేతిపై ఉన్న టాటూ గురించి కూడా ఓ వార్త వైరల్ గా మారింది. అసలు తారకరత్న చేతి పై ఉన్న టాటూ ఏంటి.. అక్కడ ఎవరి సంతకం ఉంది అనే విషయానికి వస్తే…
చిన్నప్పటి నుంచి తారకరత్నకు తన బాబాయ్ బాలకృష్ణ అంటే ఎంతో అమితమైన ప్రేమ గౌరవం.ఇలా తన బాబాయ్ పై ఇష్టంతోనే తారకరత్న తనకు గుర్తుగా సింహపు టాటూ వేయించుకున్నారని తెలుస్తోంది. అదేవిధంగా బాలకృష్ణ ఆటోగ్రాఫ్ ను తారకరత్న తన చేతిపై టాటుగా వేయించుకున్నారు. తారకరత్న తన బాబాయి పై తనకు ఉన్నటువంటి ప్రేమను ఇలా చాటిచెప్పారు. ఇకపోతే బాలకృష్ణ కూడా తారకరత్న పట్ల అంతే ప్రేమగా వ్యవహరించేవారు ఆయన అనారోగ్యానికి గురైన క్షణం నుంచి కంటికి రెప్పలా తన పక్కనే ఉంటూ తనని కాపాడుకోవడం కోసం శతవిధాలుగా ప్రయత్నించిన విషయం మనకు తెలిసిందే. అయితే తారకరత్న ప్రాణాలను కాపాడుకోవడం కోసం ఎంత కృషిచేసిన చివరికి ఆయనను కాపాడుకోలేక పోయారు.