Double iSmart: ‘డబుల్ ఇస్మార్ట్’ టీజర్లో హైలెట్ అయిన ఈ బ్యూటీ గురించి ఆసక్తికర విషయాలు

పూరి జగన్నాథ్ (Puri Jagannadh) , రామ్ (Ram) కలయికలో రూపొందిన ‘ఇస్మార్ట్ శంకర్’ (iSmart Shankar) పెద్ద బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడా చిత్రానికి ‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart) పేరుతో సీక్వెల్ రూపొందుతుంది. ఈరోజు రామ్ పుట్టినరోజు సందర్భంగా టీజర్ ను కూడా విడుదల చేశారు మేకర్స్. ఈ టీజర్ మొత్తం దర్శకుడు పూరి జగన్నాథ్ మార్క్ సినిమాల్లానే సాగింది. ముఖ్యంగా ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాలో ఏవైతే హైలెట్స్ గా నిలిచాయో.. అలాంటి ట్రాక్స్ ఈ సీక్వెల్లో కూడా ఉండబోతున్నాయని టీజర్ తో క్లారిటీ ఇచ్చారు.

శివ ట్రాన్స్ సీక్వెన్స్ ను కూడా ఈ టీజర్లో జోడించారు. ఇదిలా ఉండగా.. ఈ టీజర్లో హీరోయిన్ కావ్యా థాఫర్ (Kavya Thapar) తో పాటు మరో నటి హైలెట్ అయ్యింది. టీజర్ స్టార్టింగ్లో రామ్ ని బలవంతంగా హాస్పిటల్ బెడ్ పై తోస్తూ.. కోపంగా కనిపిస్తుంది ఆ అమ్మాయి. మిగిలిన షాట్స్ లో కూడా యమ స్టైలిష్ గా కనిపించింది. ‘ఆమె ఎవరా?’ అనే సెర్చింగ్ లు కూడా గూగుల్ లో నడుస్తున్నాయి.

వివరాల్లోకి వెళితే.. ఆమె పేరు బాని జె అని తెలుస్తుంది. పూర్తి పేరు గుర్బానీ జడ్జ్ (Gurbani Judge) అని సమాచారం.బాలీవుడ్ లో ‘ఆప్ కా సురూర్’ సినిమాతో కెరీర్ మొదలు పెట్టిన ఈమె తర్వాత ‘జొరావర్’ అనే సినిమాలో కూడా నటించింది. అంతేకాదు తెలుగులో సాయి ధరమ్ తేజ్ హీరోగా వచ్చిన ‘తిక్క’ లో (Thikka) కూడా ఈమె నటించింది. అంతేకాకుండా అజిత్ ‘వలీమై’ తో తమిళ ప్రేక్షకులను కూడా పలకరించింది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus