Imanvi: తొలి సినిమానే ఏకంగా ప్రభాస్ తో చేసేస్తుంది.. ఇమాన్వి బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) చక చకా సినిమాలు చేసేస్తున్నాడు. పైగా మంచి సినిమాలు చేస్తున్నాడు. కొత్త దర్శకులకి, అప్ కమింగ్ దర్శకులకి ఛాన్సులు ఇస్తున్నాడు. ప్రస్తుతం మారుతి (Maruthi Dasari) దర్శకత్వంలో ‘రాజాసాబ్’ (The Rajasaab) చేస్తున్న ప్రభాస్.. తన నెక్స్ట్ సినిమాని హను రాఘవపూడి (Hanu Raghavapudi) దర్శకత్వంలో చేయడానికి రెడీ అయ్యాడు. ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ పై నవీన్ ఎర్నేని (Naveen Yerneni) , వై.రవి శంకర్..లు ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నారు. కౌంట్ పరంగా చూసుకుంటే ప్రభాస్ కి ఇది 25 వ సినిమా..! అంటే ల్యాండ్ మార్క్ మూవీ అనుకోవాలి.

Imanvi

సాధారణంగా ల్యాండ్ మార్క్ మూవీ అనేసరికి అన్నీ గ్రాండ్ గా ఉండాలని హీరోలు కోరుకుంటారు. దర్శకుడు, హీరోయిన్.. ఇలా అన్ని రకాలుగా ప్యాడింగ్ బాగుండాలని ఆశపడతారు. కానీ ప్రభాస్ కి అలాంటి ఆశలు ఉండవు. హను రాఘవపూడి ఇప్పటివరకు స్టార్ హీరోలతో పనిచేసిన సందర్భాలు లేవు. అయినా అతనికి ప్రభాస్ ఛాన్స్ ఇచ్చాడు. అలాగే హీరోయిన్ విషయంలో కూడా అంతే..! హను రాఘవపూడి సినిమాల్లో హీరోయిన్ పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది.

అంతేకాకుండా అతను పరిచయం చేసిన లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) , మెహ్రీన్ కౌర్ పీర్జాదా (Mehreen Pirzada) , మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) .. ఇలా అందరూ స్టార్స్ గా ఎదిగారు. ప్రభాస్ సినిమా కోసం కూడా అతను ఓ కొత్త భామని తీసుకున్నాడు. ఆమె పేరు ఇమాన్వి (Imanvi) . ఈరోజు జరిగిన పూజా కార్యక్రమాల్లో ఎక్కువగా హైలెట్ అయ్యింది ఈమెనే. ఆమె ఫొటోలో కూడా సోషల్ మీడియాని ఓ ఊపు ఊపేస్తున్నాయి. దీంతో ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటా? అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం.. ఇమాన్వి పాకిస్థాన్ కి చెందిన అమ్మాయి అని తెలుస్తుంది.

ముస్లిం అమ్మాయి (Imanvi) అయినప్పటికీ చీరకట్టులో చాలా సంప్రదాయబద్ధంగా కనిపిస్తుంది. ఈమె మంచి డాన్సర్. క్లాసికల్ నుండి వెస్ట్రన్ వరకు ఎలాంటి డాన్స్ అయినా అదరగొట్టేస్తుంది. విశాల్ (Vishal) నటించిన ‘ఎనిమి’ (Enemy) సినిమాలోని ‘టం టం’ అనే పెళ్లి సాంగ్ కి డాన్స్ చేసి.. బాగా వైరల్ అయ్యింది. ఈమె ఇన్స్టా కథకి 7 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఇక ప్రభాస్ సినిమా కోసం హను రాఘవపూడి ఈమెను తీసుకున్నాడు అంటే.. కచ్చితంగా ఇందులో హీరోయిన్ పాత్ర డాన్స్ కి రిలేట్ అయ్యి ఉంటుంది అని అంతా అభిప్రాయపడుతున్నారు. చూడాలి మరి.

ప్రశాంత్ నీల్ పై ప్రభాస్ ఫన్నీ కౌంటర్.. సోషల్ మీడియాని షేక్ చేసేస్తున్న వీడియో.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus