నటుడు పి.ఎల్.నారాయణ తెలుగు సినిమా పరిశ్రమలో సీనియర్ మోస్ట్ నటుడు. ఆయన ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించాడు అది మనందరికీ తెలిసిందే. తండ్రి, తాగుబోతు, అమాయకమైన భర్త, బిక్షగాడు, రాజకీయ నేత ఇలా అన్ని రకాల పాత్రలలో నటించి మెప్పించారు. అలాగే తెలుగు, తమిళ భాషల్లో దాదాపుగా 300కు పైగా సినిమాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకున్నారు. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి అంచెలంచెలుగా ఎదుగుతూ స్టార్ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు పీఎల్ నారాయణ.
ఈయన (PL Narayana) తన అరవై మూడో ఏట ఆకస్మకంగా 1998 సంవత్సరం.నవంబర్ 3న మరణించాడు. నటుడు పి.ఎల్.నారాయణ మేన కోడలు హీరోయిన్ గా ఊహ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. ఊహ మరెవరో కాదు హీరో శ్రీకాంత్ భార్య అన్న విషయం మనందరికీ తెలిసిందే. అలాగే ఊహ స్వయానా నారాయణకు మేనకోడలు. తమిళ సినిమా ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది ఊహ అసలు పేరు శివరంజిని. తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వడానికంటే ముందే తమిళంలో హీరోయిన్‌గా 20కి పైగా సినిమాల్లో నటించింది.
తెలుగులో తొలిసారి ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ఆమె చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో ఆమె పేరును ఊహగా మార్చాడు ఈవీవీ. ఆ తర్వాత తెలుగులో అనేక సినిమాల్లో నటించింది. కాగా ఊహ తెలుగులో హీరో శ్రీకాంత్‌తోనే ఎక్కువ సినిమాల్లో నటించింది. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈమె తెలుగులో తొలి, చివరి సినిమా శ్రీకాంత్‌తోనే చేయడం విశేషం. వీరికి ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు.
పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైన ఆమె కుటుంబ బాధ్యతల్లో మునిగిపోయారు. ఇక వీరి కుమారుడు రోషన్ హీరోగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో పెళ్లిసందడి సినిమా తీసి సక్సెస్ అందుకున్నాడు. తర్వలో సినిమాలు చేసే అవకాశాలు ఉన్నాయి.
మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!
మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!