Bigg Boss 7 Telugu: ఈవారం ఎలిమినేషన్ ఆమెనా ? అతడా ? బిగ్ బాస్ ఇచ్చే ట్విస్ట్ ఇదేనా..!

బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టా లో ఉహించింది ఏది జరగదు. అని చాలా క్లియర్ గా చెప్పారు. కానీ, షో మాత్రం 4రోజులు అయినా చాలా చప్పగా సాగుతోంది. నామినేషన్స్ కూడా పెద్దగా కిక్ ఇవ్వలేదు. మరి ఎలిమినేషన్ లో అయినా ఆ కిక్ ఉంటుందా లేదా అని ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అసలు ఈవారం ఓటింగ్ లో టాప్ లో ఎవరు ఉన్నారు. అన్ అఫీషియల్ పోలింగ్ సైట్స్ ఏం చెప్తున్నాయి అనేది ఒక్కసారి చూసినట్లయితే.,

బిగ్ బాస్ హౌస్ లో మొదటి వారం మొత్తం 8మంది నామినేషన్స్ లో ఉన్నారు. వీళ్లలో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ టాప్ లో ఉన్నాడు. మనోడికి ఫస్ట్ నుంచీ ఉన్న సోషల్ మీడియాలో పాలోయింగ్ ఇప్పుడు అన్ అఫీషియల్ సైట్స్ లో బాగా ఉపయోగపడుతోంది. మరి హాట్ స్టార్ సింగిల్ ఓటింగ్ లో ఏ పొజీషన్ లో ఉన్నాడో తెలియదు కానీ, సైట్స్ లో మాత్రం మనోడే ముందంజలో ఉన్నాడు. ఆ తర్వాత రతిక తనకంటూ ఒక ప్రత్యేకమైన ఓటింగ్ ని దక్కించుకుని సేఫ్ అయ్యేలాగానే కనిపిస్తోంది.

ఆ తర్వాత గౌతమ్ కృష్ణ కి కూడా ఓట్లు బాగానే పడుతున్నాయి. ఇక షకీల, శోభాశెట్టి, థామిని ఓటింగ్ లో పర్వాలేని అనిపిస్తున్నారు. ఇక మిగిలిన ఇద్దరే డేంజర్ జోన్ లో ఉన్నారు. వారిలో టేస్టీ తేజ ఇంకా కిరణ్ రాథోడ్ ఉన్నారు. వీరిద్దరూ ఫస్ట్ వీక్ డేంజర్ జోన్ లోనే ఉన్నారు. మొదటి వారం కాబట్టి ఈవారం ఎలిమినేషన్ తీసేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఒకవేళ ఎలిమినేషన్ తీసేస్తే వీరిద్దరూ బ్రతికి పోతారు. లేదంటే మాత్రం ఇద్దరిలో ఒకరు ఇంటికి వెళ్లిపోవాల్సి ఉంటుంది.

ఎన్నో ఆశలతో బిగ్ బాస్ హౌస్ (Bigg Boss 7 Telugu) లోకి అడుగుపెట్టిన టేస్టీ తేజ ఫస్ట్ వీక్ బయటకి వచ్చేస్తే చాలా ఫీల్ అవుతాడు. అలాగే, చాలాకాలం తర్వాత తెలుగు ప్రేక్షకులకి దగ్గరవుదామని వచ్చిన కిరణ్ కూడా ఫస్ట్ వీక్ వెళ్లిపోతే బాగా పీల్ అవుతుంది. బిగ్ బాస్ కింగ్ నాగార్జున ఆడవాళ్ల పక్షపాతి కాబట్టి ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ ఉండదని, తీసేస్తారని బిగ్ బాస్ విశ్లేషకులు రివ్యూలలో చెప్తున్నారు. మరి చూద్దాం.. మొదటి వారం ఎలాంటి ట్విస్ట్ ఉండబోతోందనేది.

మంది పార్టిసిపెంట్స్ తో దుమ్ము లేచిపోయిన బిగ్ బాస్ సీజన్ 7 స్టేజ్..!

సీజన్ – 7 లో 5 బ్లండర్ మిస్టేక్స్ ఇవే..!
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus