బ్రదర్ బ్రదర్ అంటూనే ముంచేశాడండీ

గతవారం ‘ప్రొజెక్ట్ z’ అనే తమిళ అనువాద చిత్రం విడుదలైంది అనే విషయం ఎంతమందికి తెలుసో కానీ.. ఇవాళ ఆ సినిమాని తెలుగులో రిలీజ్ చేసిన ఎస్.కె.బషీద్ చేసిన హడావుడి పుణ్యమా అని ఆ సినిమా రిలీజ్ అయ్యిందనే విషయం జనాలకి తెలిసింది. ఇవాళ ఎస్.కె.బషీద్ ప్రత్యేకించి ఒక ప్రెస్ మీట్ పెట్టి మరీ “సందీప్ కిషన్ నన్ను మోసం చేశాడు, బ్రదర్ బ్రదర్ అంటూనే నాచేత కోటి ఇరవై లక్షల రూపాయలు ఖర్చు చేయించాడు. ఇప్పుడేమో అసలు నాకు సినిమాతో సంబంధమే లేదు అని బిల్డప్ ఇవ్వడమే కాక నా ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తున్నానని ట్విట్టర్ లో హల్ చల్ చేయడం” అనేది ఎంతవరకూ సబబు అని మీడియా సాక్షిగా కన్నీళ్లు పెట్టుకొన్నాడు.

అయితే.. ఈ విషయమై సందీప్ కిషన్ స్పందిచకపోయినప్పటికీ, ఈ సినిమాకి డైలాగ్ రైటర్ గా వర్క్ చేసిన వెన్నెలకంటి సోదరుడు రాకీ వెన్నెలకంటి ఒక వీడియో రిలీజ్ చేశాడు. సదరు వీడియోలో రాకేందుమౌళి మాట్లాడుతూ.. “సందీప్ కిషన్ డబ్బింగ్ టైమ్ లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకొన్నాడు. ఇంకా చెప్పాలంటే.. ఎస్.కె.బషీద్ తమిళ అనువాద చిత్రాన్ని స్ట్రయిట్ సినిమాలా రిలీజ్ చేయడమే కాక, తన పేరు దర్శకుడిగా వేయించుకోవడం అనేది ఎంతవరకూ సమంజసం” అంటూ కాస్త ఘాటుగానే స్పందించి, సందీప్ కిషన్ కి సపోర్ట్ చేశాడు. ఈ ఇష్యూలో క్లారిటీ రావాలంటే సందీప్ కిషన్ రంగంలోకి దిగాల్సిందే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus