డాక్టర్ రతీదేవి లుక్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

పెళ్లికి సమంత ముందు గ్లామరస్ పాత్రలతో అందరిమనసులో స్థానం సంపాదించుకుంది. పెళ్లి తర్వాత ఆలోచింపచేసే పాత్రల్లో కనిపించి తన స్థానాన్ని పదిల పరుచుకోనుంది. రొటీన్ కి భిన్నమైన పాత్రలను ఎంచుకుని.. ఆ పాత్రలకు ప్రాణం పోయనుంది. సుకుమార్ దర్శకత్వంలో సమంత చేస్తున్న రంగస్థలం సినిమాలో పక్క పల్లెటూరి అమ్మాయిలా.. అది కూడా పాతికేళ్ళక్రితం పేద అమ్మాయిలా.. కనిపించనుంది. ఇప్పటికే లీక్ అయినా ఆమె ఫోటోలు చూస్తుంటే.. హీరో రామ్ చరణ్ కి సరి సమానంగా పేరు దక్కించుకోవడం ఖాయం అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇక రెండో సినిమా మహానటి. ఇందులో అలనాటి నటి, అభినయ సత్యభామ జమున పాత్రలో మెప్పించనుంది.

ఆ పాత్రకు సంబందించిన లుక్ బయటికి రాలేదు కానీ.. తప్పకుండా మెప్పిస్తుందని ఫిక్స్ అయ్యారు. ఈ రెండింటికంటే ముందు సమంత తమిళంలో చేసిన ఇరుంబుదురై రిలీజ్ కాబోతోంది. విశాల్ హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్న ఇరుంబు తిరాయ్ లో లీడ్ రోల్ చేస్తోంది. ఇందులోని ఆమె రోల్ ని రివీల్ చేస్తూ పోస్టర్స్ రిలీజ్ చేశారు. ఈ మూవీలో సమంత డాక్టర్ రతీదేవిగా కనిపించనుంది. గలగలా గోదారిలా మాట్లాడే సమంత.. ఈ చిత్రంలో శాంతంగా పొడి పొడి మాటలతో ఆకట్టుకోనుంది. ఈ చిత్రం జనవరి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘మహానటి’ సినిమా మార్చి 29న, మార్చి 30వ తేదీన రంగస్థలం చిత్రం రిలీజ్ కానున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus