Drushyam 2 Movie: ఓటీటీ ఆఫర్ ను వెయిటింగ్ లిస్ట్ లో పెట్టిన వెంకీ నిర్మాత

విక్టరీ వెంకటేష్ నటించిన నారప్ప సినిమా థియేటర్ లో చూడాలని అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూశారు. చిత్ర యూనిట్ సభ్యులు అలాగే హీరో వెంకటేష్ కూడా తప్పకుండా థియేటర్ లోనే వస్తుంది అని నమ్మకం గా చెప్పారు. నిర్మాతలు కూడా ఒప్పించి వెయిట్ చేయించారు కూడా. కానీ ఆ సినిమా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో రావడంతో ఒక్కసారిగా అభిమానులు నిరాశ చెందారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఓటీటీలో విడుదల చేయకుండా ఉండలేకపోతున్నామని నిర్మాత సురేష్ బాబు వివరణ కూడా ఇచ్చారు.

అయితే వెంకటేష్ తదుపరి సినిమా దృశ్యం 2 మాత్రం థియేట్రికల్ గానే వస్తుందని ఇదివరకే చాలా క్లియర్ గా వివరణ ఇచ్చారు. మలయాళం దృశ్యం 2 సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాను వెంకటేష్ జెట్ స్పీడ్ లో ఫినిష్ చేశాడు. సినిమాకు సంబంధించిన అన్ని పనులు కూడా పూర్తయ్యాయి. ఇక పరిస్థితులు మారితే వీలైనంత త్వరగా విడుదల చేయాలని కూడా చిత్ర నిర్మాత సురేష్ బాబు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు.

ఇక ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొకసారి టికెట్ల రేట్ల విషయంలో కన్ఫ్యూజన్ లో పడేయడంతో మళ్లీ ఆయన ఓటీటీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల డిస్ని ప్లస్ హాట్ స్టార్ అయితే దృశ్యం 2 సినిమాకు ఒక భారీ ఆఫర్ ను ప్రకటించినట్లు తెలుస్తోంది. సురేష్ బాబు సాధారణంగా ఇంట్రెస్ట్ లేకపోతే ఆఫర్ ను వెంటనే రిజెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ దృశ్యం 2 సినిమా విషయంలో మాత్రం హాట్ స్టార్ ఆఫర్ ను వెయిటింగ్ లిస్టులో పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బిగ్ బాస్5’ మానస్ గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ లహరి షెరి గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ ప్రియా గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus