Brahmamudi August 31st: అనామిక విషయంలో కళ్యాణ్ కు సాయం చేసిన కావ్య!

కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటున్నటువంటి బ్రహ్మముడి సీరియల్ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది. ఇక నేటి ఎపిసోడ్ లో భాగంగా ఈ సీరియల్ లో ఏం జరిగిందనే విషయానికి వస్తే.. మహిళా సంఘం సభ్యులు కావ్య రాజ్ దంపతులకు సన్మానం చేస్తారు. ఈ వార్తను అందరికీ తెలిసేలా చేస్తాము అంటూ వారు కొన్ని ఫోటోలు వీడియోలు కూడా తీసుకుంటారు. అనంతరం వారు వెళ్ళిపోయిన తర్వాత సీతారామయ్య మాట్లాడుతూ దుగ్గిరాల కుటుంబ పరువు ప్రతిష్టలను ఉన్నత శిఖరాలకు చేర్చావు. నీకు ఏదైనా కానుక ఇవ్వాలని ఉంది ఏం కావాలో చెప్పమ్మా అంటూ అడుగుతారు.

నన్ను ఈ కుటుంబం వెలివేసారు కానీ ఈ కుటుంబంలో నన్ను ఒక సభ్యురాలుగా చేర్చుకోండి తాతయ్య అది చాలు అనడంతో అది భోజనం చేసేటప్పుడే చెప్పాము కదా అంటూ సుభాష్ మాట్లాడతారు. ఇంకా ఏదైనా కోరుకోమ్మా అంటూ సుభాష్ అనడంతో కుటుంబ సభ్యుల ఆదరణ కన్నా నాకు ఇంకేం కావాలి మామయ్య అంటూ కావ్య మాట్లాడుతుంది ఆ సమయంలో అపర్ణ మీరు అందరు దీనిని నెత్తిన పెట్టుకోండి కానీ నేను మాత్రం తనను కోడలిగా అసలు అంగీకరించను అంటూ కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

మరోవైపు హాస్పిటల్లో స్వప్న కంగారు పడుతూ ఉంటుంది ఇప్పుడు డాక్టర్ కడుపు లేదనే విషయం ఎక్కడ బయట పెడుతుందోనని కంగారుపడుతూ మనం ఇంతసేపు ఇక్కడ వెయిట్ చేయడం అవసరమా అత్తయ్య వెళ్లిపోదామంటూ రుద్రాణిని రెచ్చగొడుతుంది దాంతో రుద్రాన్ని కూడా వెళ్దాం పద అని వెళ్లబోతుండగా అంతలోపు అటెండర్ వచ్చి డాక్టర్ మిమ్మల్ని పిలుస్తున్నారని చెప్పడంతో స్వప్న షాక్ అవుతుంది. కంగారు కంగారుగా లోపలికి వెళ్ళగా అక్కడ తనని మొదట్లో చెకప్ చేసి తనకు కడుపు లేదనే విషయం తెలిసిన డాక్టర్ కావడంతో స్వప్న ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంటుంది.

ఇక స్వప్న చూసి డాక్టర్ కి కూడా తనకు కడుపు లేదని విషయం గుర్తుకు వస్తుంది అయితే స్వప్న మాత్రం సైగలతో దయచేసి నిజం చెప్పద్దు తనని వేడుకుంటుంది. ఇక లోపలికి వెళ్ళిన తర్వాత రుద్రాన్ని స్వప్న ఇబ్బందుల గురించి చెప్పడంతో మీరు బయటకు వెళ్ళండి నేను చెక్ చేసి చెబుతాను అని చెప్పగా స్వప్న మాత్రం ఈ ఒక్కసారికి నన్ను ఈ సమస్య నుంచి బయట పడేయండి మేడం అని బ్రతిమిలాడటంతో ఈ విషయం అప్పుడే చెప్పమని చెప్పాను కదా నీకు అంటూ డాక్టర్ మాట్లాడుతారు. నాకు చెప్పే అవకాశం రాలేదు మీరే ఎలాగైనా కాపాడాలి అని చెబుతుంది.

ఇక రుద్రాణి వాళ్ళు అక్కడికి రావడంతో బిడ్డకు ఎలాంటి సమస్య లేదు కానీ ముందు ఇచ్చిన టాబ్లెట్స్ వాడండి అలాగే మీ కోడలితో కాస్త ప్రేమగా మాట్లాడండి అంటూ చెప్పి పంపిస్తుంది. మరోవైపు అనామిక కళ్యాణ్ కి ఫోన్ చేయడంతో నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం మానేశారు అనగా మీకు పెళ్లయింది కదా అంటూ కళ్యాణ్ మాట్లాడతారు అందుకే నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు అని చెప్పడంతో మీరు ఆరోజు హోటల్లో చూసింది నన్ను కాదు అంటూ అనామిక చెబుతుంది అదేవిధంగా నేను మీ ముందుకు వచ్చిన మీరు గుర్తుపట్టలేదని చెబుతుంది. మీరు నేను ఇచ్చిన గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేశారా అనగా లేదు అని కళ్యాణ్ చెప్పడంతో అది ఓపెన్ చేసి చూడండి అలాగే అందులో నా అడ్రస్ కూడా ఉంటుంది అని చెప్పడంతో కళ్యాణ్ ఆ గిఫ్ట్ వెతకగా అందులో పార్కులో ఈయన రాసి పడేసిన కవితలన్నీ అచ్చు వేసి ఉంటుంది అది చూసి అందరూ సంతోషపడతారు.

ఇక గిఫ్ట్ బాక్స్ పై అనామిక అడ్రస్ కోడ్ లాంగ్వేజ్ లో రాసి ఉంటుంది అయితే ఆ అడ్రస్ కనుక్కోవడానికి దుగ్గిరాల కుటుంబ సభ్యులందరూ కూడా ఎంత ప్రయత్నించినా సాధ్యం కాదు కానీ కావ్య మాత్రం ఆ కోడ్ లాంగ్వేజ్ కి అర్థం చెప్పి కళ్యాణ్ ను అక్కడికి వెళ్ళమని చెబుతుంది దీంతో అందరూ కావ్య తెలివితేటలపై ప్రశంసలు కురిపిస్తారు. ఇక వరలక్ష్మి వ్రతం చేయమని చిట్టి కావ్యకు చెప్పడంతో అపర్ణ షాక్ అవుతుంది. తరువాత ఎపిసోడ్ లో కావ్య వంటగదిలో పనిచేస్తూ ఉండగా అక్కడకు అపర్ణ వెళుతుంది. నువ్వు ఇంట్లో తిరగడం నేను చూడలేకపోతున్నాను అంటూ ఆపర్ణ మాట్లాడటంతో మీ అబ్బాయి మీ మనసు మార్చవచ్చు అంటూ కావ్య మాట్లాడుతుంది ఇక కావ్య పైకి వెళుతుండగా రాజ్ ఎదురుపడి వ్రతం నువ్వు చెయ్యి ఫలితం నేనిస్తానని చెబుతాడు మరి ఈయన ఎలాంటి ఫలితం ఇస్తాడో వేచి చూడాలి.

మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?

మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!

Read Today's Latest Television Update. Get Filmy News LIVE Updates on FilmyFocus