ఆయన ఉన్నాడనే సినిమా ఒప్పుకొన్నాను: దుల్కర్ సల్మాన్

  • July 26, 2018 / 08:13 AM IST

తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ ఇలా ఏ భాషలో నటిస్తున్న హీరోహీరోయిన్లు మాత్రమే కాదు క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ కి కూడా “బాలీవుడ్” అనేది స్టాండర్డ్ గోల్. ఒక్కసారైనా బాలీవుడ్ సినిమాలో చిన్న పాత్రలోనైనా మెరవాలని కోరుకొంటారు. అక్కడ నటిస్తే వచ్చే పాపులారిటీ, క్రేజ్ అలాంటిదనుకోండి. అయితే.. విచిత్రంగా మలయాళ సూపర్ స్టార్ అయిన దుల్కర్ సల్మాన్ మాత్రం తాను బాలీవుడ్ పై మోజుతో కాదు.. కేవలం ఇర్ఫాన్ ఖాన్ కోసమే అని స్టేట్ మెంట్ ఇచ్చి బాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు.

నిజానికి “కార్ వాన్” సినిమా కోసం దర్శకనిర్మాతలే దుల్కర్ సల్మాన్ ను వెతుక్కుంటూ వెళ్లారు కానీ.. దుల్కర్ ఎవర్నీ కనీసం ఆఫర్ అడగలేదు కూడా. ఈ విషయాన్ని సదరు చిత్ర దర్శకనిర్మాతలే స్వయంగా పేర్కొనడం విశేషం. ఇటీవల విడుదలైన “కార్ వాన్” ట్రైలర్ సినిమా అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకొంది. ఆగస్ట్ 3న ప్రమాచవ్యాప్తంగా విడుదలవుతున్న ఈ చిత్రం గనుక హిట్ అయితే.. మలయాళ, తెలుగు భాషల్లో రీమేక్ లేదా డబ్బింగ్ చేసే ఆలోచనల్లో ఉన్నారు పలువురు దర్శకనిర్మాతలు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus