Dulquer Salmaan: నాన్న ఎలాంటి కాంప్లిమెంట్స్ ఇవ్వరు!

Advertisement

మలయాళం సూపర్ స్టార్ హీరో మమ్ముట్టి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు నటుడు దుల్కర్ సల్మాన్. ఈయన సావిత్రి జీవిత కథ ఆధారంగా తరికెక్కిన మహానటి సినిమాలో జెమినీ గణేషన్ పాత్రలో నటించారు. ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఎంతో సుపరిచితమైన దుల్కర్ సల్మాన్ తాజాగా సీతారామం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా విడుదలైన మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని ప్రేక్షకులను సందడి చేస్తుంది.

ఇక ఈ సినిమా అన్ని భాషలలోనూ మంచి కలెక్షన్లను కూడా రాబడుతోంది.ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న దుల్కర్ సల్మాన్ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. సాధారణంగా సెలబ్రిటీల వారసులు ఇండస్ట్రీలోకి అడుగుపెడితే వారికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు కష్టాలు లేకుండా అవకాశాలు వస్తాయి అని భావిస్తుంటారు. ఈ క్రమంలోనే మలయాళీ సూపర్ స్టార్ కొడుకుగా ఎంట్రీ ఇచ్చిన దుల్కర్ సల్మాన్ కూడా కెరియర్ మొదట్లో ఏవైనా కష్టాలు పడ్డారా అనే ప్రశ్న ఎదురైంది.

ఈ క్రమంలోనే ఈ ప్రశ్నకు దుల్కర్ సమాధానం చెబుతూ తన నాన్న సూపర్ స్టార్ అయినప్పటికీ తాను కూడా కెరియర్ మొదట్లో అవకాశాలు అందుకోవడానికి చాలా కష్టపడ్డానని తెలిపారు. నాన్న సూపర్ స్టార్ కావడం వల్ల నాకు మరింత బాధ్యత పెరిగింది. తాను సినిమాని ప్రేక్షకులను ఎంతో గౌరవిస్తాను ప్రేక్షకులే నాకు ఈ అవకాశాలను కల్పించారని తెలిపారు.

ఇక తన సినిమా హిట్ అయితే నాన్నగారి కాంప్లిమెంట్ ఎలా ఉంటుందనే ప్రశ్న ఎదురవడంతో నాన్న తను నటించిన ఏ సినిమాకి కాంప్లిమెంట్ ఇవ్వరని తెలిపారు.ఆయన సినిమా చూస్తున్న సమయంలో నేను ఆయన ముందు కూర్చుని తన ఫేస్ లో మారుతున్న ఎక్స్ప్రెషన్స్ గమనిస్తాను.ఆయన మొహంలో చిరునవ్వు కనిపించిన ఒక సన్నివేశం బాగుందనీ క్లాప్స్ కొట్టిన అవే తన కాంప్లిమెంట్స్ అని భావిస్తాను అంటూ ఈ సందర్భంగా దుల్కర్ సల్మాన్ వెల్లడించారు.

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus