డీజే ఆడియో రివ్యూ

  • June 13, 2017 / 12:33 PM IST

సరైనోడు తర్వాత అల్లు అర్జున్ చేస్తున్న సినిమా దువ్వాడ జగన్నాథం. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ ఆడియో రిలీజ్ వేడుక ఆదివారం వైభవంగా జరిగింది. దేవీశ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఈ పాటలు ఎలా ఉన్నాయంటే..?

డీజేఆడియో రిలీజ్ కంటే ముందే సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన పాట డీజే. యూట్యూబ్ లో రిలీజ్ కాగానే ఈ సాంగ్ వ్యూస్ లో రికార్డ్ సృష్టించింది. కొన్ని గంటల్లోనే ట్రెండింగ్ అయింది. సీనియర్ సినీ రచయిత జొన్నవిత్తుల రాసిన పదునైన పదాలను దేవీ సరికొత్తగా స్వరపరచగా, అందుకు యువ గాయకుడు విజయ్ ప్రకాష్ తన గాత్రంతో పవర్ ఇచ్చారు.

గుడిలో బడిలో మడిలో వడిలో అచ్చమైన స్వచ్ఛమైన తెలుగు, సంస్కృత సాహిత్యంతో సాహితీ కలం నుంచి వచ్చిన పాట “గుడిలో బడిలో మడిలో వడిలో”. ఈ పాట చిన్న బిట్ రిలీజ్ చేస్తేనే విపరీతమైన లైక్లు అందుకుంది. M.L.R. కార్తికేయన్, చిత్ర పాడిన ఈ పాట వేగంగా అందరి మనస్సులో చేరిపోయింది. దేవీకే సొంతమైన బీట్ తో యువకుల హార్ట్ బీట్ ని టచ్ చేశారు.

మెచ్చుకో పిల్లో ..బన్నీలో అందరికీ నచ్చే ఆటిట్యూడ్ చిపిలిదనం. అది మెండుగా ఉండే పాట మెచ్చుకో పిల్లో … అల్లు అర్జున్ కోసం ప్రత్యేకంగా డీఎస్పీ కంపోజ్ చేసినట్లు ఉంటుంది ఈ పాట. శ్రీరామ్ రాసిన ఈ పాటను నకాష్ అజీజ్ చక్కగా పాడారు.

సీటీ మార్ అల్లు అర్జున్ మొదటి సినిమా నుంచి మాస్ ఆడియన్స్ ని మరిచిపోలేదు. అలాగే డీజే లోను వారికోసం అందించిన పాట సీటీ మార్. థియేటర్ మొత్తం విజిల్స్ తో నిండి పోయే విధంగా ఈ పాటను దేవి కంపోజ్ చేశారు. జస్ ప్రీత్ జాజ్, రీటా ఉత్సాహంగా పాడిన ఈ పాటకు బాలాజీ క్యాచీగా ఉండే లిరిక్స్ ఇచ్చారు.

బాక్స్ బద్దలైపోయే.. సరైనోడు చిత్రంలో బ్లాక్ బస్టర్ సాంగ్ చేసిన హంగామా అంత ఇంతాకాదు. ఆ రేంజ్ లో ఈ చిత్రంలో ‘బాక్స్ బద్దలై పోయే’ పాట ఉంది. థియేటర్లో ఆడియన్స్ అందరూ లేచి స్టెప్పులు వేసే విధంగా దేవి కంపోజ్ చేశారు. సాగర్, గీతా మాధురి కలిసి ఈ పాటలో ఫుల్ జోష్ నింపారు. ఇక బన్నీ, పూజా హెగ్డే థియేటర్లో రచ్చ చేయడం తథ్యం.

గతంలో ఆర్య, బన్నీ, ఆర్య 2 , జులాయి, ఇద్దరమ్మాయిలతో, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలకు దేవీ శ్రీ అద్భుతమైన పాటలను అందించారు. వాటన్నింటికంటే మించి డీజే ఆల్బం ఇచ్చారు. ఈ పాటలు వెండితెరపై మరింత అందంగా ఉంటాయనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus