సినిమా ఇండస్ట్రీలో కాంబినేషన్ ఓ బ్రహ్మపదార్థం అని చెప్పాలి. అది కుదిరితే… సగం హిట్ కొట్టినట్లే అని అంటుంటారు. దాని కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తారు. నిర్మాతలు రకరకాల ప్రయత్నాలు చేసి ఓకే చేస్తారు. ఇదంతా స్టార్ హీరోలు – స్టార్ దర్శకుల విషయంలో అయితే ఇంకొంచెం ఎక్కువ కష్టం. అంత కష్టపడి కుదిర్చిన కాంబినేషన్ రద్దయిపోతే… అందరూ బాధపడుతుంటారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే ఎన్టీఆర్ – త్రివిక్రమ్ సినిమా రద్దు అయిపోయింది. ఇలా స్టార్ కాంబోలు ఎన్ని రద్దయ్యాయి అని ఆలోచిస్తే.. ఆ మధ్య మహేష్ – సుకుమార్ సినిమా గుర్తొచ్చింది.
ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సినిమా ఉంటుందని గతేడాదే ప్రకటించారు. కరోనా పరిస్థితుల కారణంగా సినిమా ఓపెనింగ్ ఆలస్యమవుతూ వచ్చింది. ఆఖరికి ఇటీవల స్టార్ట్ చేశారు. అయితే షూటింగ్ ముచ్చట్లు ఏవీ వినిపించలేదు. దీంతో సినిమా ఉండదు అని పుకార్లు మొదలయ్యాయి. దీనిని ఓసారి నిర్మాత నాగవంశీ ఖండించాడు. కానీ తీరా ఇప్పుడు చూస్తే క్యాన్సిల్ అని చెప్పేశారు. దీని వెనుక కారణంగా క్రియేటివ్ డిఫరెన్స్ అని అంటున్నారు. కారణాలు ఎవరూ చెప్పరు కాబట్టి… ఇది ఇక్కడ వదిలేద్దాం.
ఇదే రేంజిలో కాకపోయినా గతంలోనూ ఇలాంటి రద్దులు చాలా జరిగాయి టాలీవుడ్‌లో. రీసెంట్‌గా అంటే మహేష్‌బాబు – సుకుమార్ అని చెప్పాలి. ఈ కాంబోలో సినిమా ఉంటుందని చాలా రోజులు చెబుతూ వచ్చినా… ఆఖరిగా ఇక మా సినిమా లేనట్లే ఇద్దరూ ప్రకటించారు. మళ్లీ ఎప్పటికైనా కలసి పని చేస్తాం అని అన్నారు కానీ అలాంటి సూచనలు కనిపించలేదు. అనిల్ రావిపూడి డైరక్షన్‌లో నితిన్, రామ్ సినిమాలు వస్తాయని వార్తలొచ్చి వెనక్కి వెళ్లిపోయాయి. అయితే చాలా సినిమాల పుకార్లు వస్తాయి.. కొన్ని మాత్రం ఆఖరి వరకు వచ్చి వెనక్కిపోతాయి. ఇప్పుడు మేం చెప్పినవి అలాంటివే. అందులోనూ స్టార్ కాంబోవి అన్నమాట.
Most Recommended Video
‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!