“ఈ కథలో పాత్రలు కల్పితం” టీజర్ రిలీజ్ చేసిన మెగాబ్రదర్ నాగబాబు!!

పవన్‌ తేజ్‌ కొణిదెల హీరోగా పరిచయం చేస్తూ మాధవి సమర్పణలో ఎంవిటి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బేనర్‌ పై అభిరామ్ ఎమ్‌. దర్శకత్వంలో రాజేష్‌ నాయుడు నిర్మిస్తున్న థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ ‘ఈ కథలో పాత్రలు కల్పితం’. మేఘన హీరోయిన్ గా న‌టిస్తుంది. ఇప్ప‌టికే విడుద‌లైన ఈ మూవీ పోస్టర్స్‌ కి, సాంగ్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. డిసెంబర్ 18న ఈ చిత్రం టీజర్ ని మెగాబ్రదర్ నాగబాబు రిలీజ్ చేసి సినిమా గ్రాండ్ సక్సెస్ కావాలని టీమ్ అందరికీ బెస్ట్ విషెస్ తెలిపారు.. ప్రస్తుతం పోస్టుప్రొడక్షన్ కార్యక్రమాలు తుది దశకు చేరుకున్న ఈ చిత్రం త్వరలోనే థియేటర్స్ లలో విడుదల కావడానికి సన్నద్ధం అవుతోంది..

ఈ సందర్భంగా నిర్మాత రాజేష్‌ నాయుడు మాట్లాడుతూ – ‘మా చిత్ర టీజర్ రిలీజ్ చేసిన నాగబాబు గారికి నా హృద‌య‌పూర్వ‌క ధ‌న్య‌వాదాలు. ఆడియెన్స్ థ్రిల్ ఫీలయ్యే విధంగా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఎంటర్టైన్ మెంట్ జోడించి ఈ కథలో పాత్రలు కల్పితం’ చిత్రాన్ని రూపొందించాం. దర్శకుడు అభిరామ్ క్వాలిటీ తగ్గకుండా ఎంతో అద్భుతంగా ఈ సినిమాని తెరకెక్కించాడు.. టైటిల్ కి పాజిటివ్ బజ్ క్రియేట్ అవ‌డంతో మా హీరో పవన్‌ తేజ్‌ కొణిదెలకి పర్ఫెక్ట్ లాంచింగ్ ఫిల్మ్ అవుతుంది ..అన్నారు.

డైరెక్టర్ అభిరామ్ ఎమ్‌ మాట్లాడుతూ – ‘ ఈ సినిమాతో పవన్ తేజ్ కొణిదెల హీరోగా మంచి పేరు తెచ్చుకుంటాడు.. నిర్మాత రాజేష్ నాయుడు గారు సినిమాను కాంప్రమైజ్ కాకుండా రిచ్ గా నిర్మించారు. ఔట్ పుట్ చాలా బాగా వ‌చ్చింది. తప్పకుండా ఈ చిత్రం అన్నివర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఉంటుంది అన్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus