Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Reviews » Euphoria Review in Telugu: యుఫోరియా సినిమా రివ్యూ & రేటింగ్!

Euphoria Review in Telugu: యుఫోరియా సినిమా రివ్యూ & రేటింగ్!

  • February 6, 2026 / 10:21 PM ISTByDheeraj Babu
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
Euphoria Review in Telugu: యుఫోరియా సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • విఘ్నేష్ గవిరెడ్డి (Hero)
  • సారా అర్జున్ (Heroine)
  • భూమిక చావ్లా, గౌతమ్ మీనన్, నాజర్, అద్దాల పృధ్వీరాజ్, లిఖిత యలమంచిలి, ఆదర్శ్ బాలకృష్ణ తదితరులు (Cast)
  • గుణశేఖర్ (Director)
  • రాగిణి గుణ (Producer)
  • కాలభైరవ (Music)
  • ప్రవీణ్ కే.పోతన్ (Cinematography)
  • ప్రవీణ్ పూడి (Editor)
  • Release Date : ఫిబ్రవరి 06, 2026
  • గుణ హ్యాండ్ మేడ్ ఫిలిమ్స్ (Banner)

గుణశేఖర్ అంటే.. భారీ తారాగణం, అంతకంటే భారీ సెట్స్ అని మాత్రమే తెలుసు చాలా మందికి. కానీ.. ఆ భారీతనం కంటే ముందు “సొగసు చూడతరమా” లాంటి సెన్సిబుల్ సినిమా తీసి తన బలం ఎప్పుడో నిరూపించుకున్నాడాయన. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత స్టార్ క్యాస్ట్, సెట్స్ తో సంబంధం లేని ఒక సెన్సిబుల్ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు గుణశేఖర్. అదే “యుఫోరియా”. నవతరం ధోరణి నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి మొదట్లో కనీస స్థాయి బజ్ లేకపోయినా.. సినిమాలో కీలకపాత్ర పోషించిన సారా అర్జున్ నటించిన “దురంధర్” బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం “యుఫోరియా”కి కలిసొచ్చి.. సినిమా విడుదలకు దోహదపడింది. మరి గుణశేఖర్ దర్శకుడిగా ఏమేరకు ఆకట్టుకున్నాడు? అనేది చూద్దాం..!!

Euphoria Movie Review

Euphoria Movie Review and Rating

కథ: 17 ఏళ్ల చైత్ర (సారా అర్జున్) పగటి పూట పబ్ లో ఒక పార్టీకి వెళ్లొస్తుండగా.. స్నేహితులుగా పరిచయమైన అయిదుగురు యువకులు, ఓ చిన్న పార్టీ అని ఆమెను ఆహ్వానించి.. మిట్ట మధ్యాహ్నం నగరం నడిబొడ్డున ఓ సందు చివర కారు పార్క్ చేసి.. ఒక్కొక్కరుగా చైత్రను చెరుస్తారు.

సివిల్స్ కి ప్రిపేర్ అవ్వాలనే ఆశయం, తెగువ ఉన్న చైత్ర.. ఆ అయిదుగుర్ని న్యాయస్థానం ముందు నిలబెట్టి.. చట్టం, పోలీసులు సహాయంతో వాళ్లకి జీవిత ఖైదు శిక్ష పడేలా చేస్తుంది.

అయితే.. కొన్నేళ్ల తర్వాత నిందితుల్లో ముఖ్యుడైన వికాస్ (విఘ్నేష్) తల్లి వింధ్య తనను శిక్షించాలంటూ కోర్టును ఆశ్రయిస్తుంది. ఎందుకు అనేది ప్రశ్న. ఆ ప్రశ్నకి సమాధానమే “యుఫోరియా” చిత్రం.

Euphoria Movie Review and Rating

నటీనటుల పనితీరు: కొత్త కుర్రాడైన విఘ్నేష్ గవిరెడ్డిని చూస్తే అసహ్యంతో కూడిన కోపం కలుగుతుంది. అదే విధంగా చివర్లో అతడి ఏడుపు చూస్తే బాధ కలుగుతుంది. ఒక నటుడిగా అతడు ఎంతలా క్యారెక్టర్ ను ఓన్ చేసుకుని నటించాడు అనేందుకు ఇది ఉదాహరణ. నటుడిగా విఘ్నేష్ కి మంచి భవిష్యత్ ఉంది.

సారా అర్జున్ పాత్ర నిడివి తక్కువ అయినప్పటికీ.. ఆమె పాత్ర క్రియేట్ చేసే ఇంపాక్ట్ సినిమాకి హైలైట్ అని చెప్పాలి. తండ్రి చేతిని విసిరికొట్టే సన్నివేశం మరియు క్లైమాక్స్ లో వచ్చే సీన్ లో సారా అర్జున్ అద్భుతమైన నటనతో అలరించి, సినిమాకి ప్రాణం పోసింది.

భూమిక పాత్రలో ఉన్న బరువు ఆమె నటనలో కనిపించలేదు. నటిగా ఇంచుమించుగా 25 ఏళ్లు పూర్తిచేసుకున్న ఆమె ఇంకా లిప్ సింక్ కి ఇబ్బందిపడుతుండడం గమనార్హం.

గౌతమ్ వాసుదేవ్ మీనన్ కెరీర్లో ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా ఎన్నో సినిమాలు చేసినప్పటికీ.. ఈ సినిమాలో అతడు పండించిన డామినేషన్ & క్రౌర్యం కొత్తగా ఉన్నాయి. ముఖ్యంగా ఖైదీలకి బిర్యానీ తినిపించే సన్నివేశంలో అతడి కళ్లు చూస్తే నిజంగా భయపడాల్సిందే.

మిగతా నటీనటులందరూ తమ తమ పాత్రల్లో పర్వాలేదనిపించుకున్నారు.

Euphoria Movie Review and Rating

సాంకేతికవర్గం పనితీరు: ప్రొడక్షన్ వైజ్ చాలా లోటుపాట్లు ఉన్నాయి. ముఖ్యంగా కలరింగ్ & డిఐ విషయంలో చాలా బెటర్మెంట్ అవసరం. కెమెరా వర్క్ డీసెంట్ గా ఉంది. ఎడిటింగ్ ఫార్మాట్ కొత్తగా ఉంది. నేపథ్య సంగీతం థ్రిల్ ని బాగా ఎలివేట్ చేసింది. పాటలు ఇంకాస్త బాగుంటే మరింత రీచ్ వచ్చేది.

ఒక దర్శకుడిగా కంటే రచయితగా గుణశేఖర్ ఆశ్చర్యపరిచాడు. ముఖ్యంగా ఫస్టాఫ్ ను నడిపించిన విధానం. ఏమాత్రం ల్యాగ్ లేకుండా చాలా క్రిస్ప్ గా ఉంటుంది ఫస్టాఫ్. అయితే.. సెకండాఫ్ మదర్ సెంటిమెంట్ & రియలైజేషన్ పాయింట్స్ ను డీల్ చేయడంలో తడబడ్డాడు. ముఖ్యంగా ఆపరేషన్ యుఫోరియాని ఇరికించిన విధానం సినిమాకి మైనస్ గా మారింది. ఆ ఎపిసోడ్ మొత్తంలో లాజికల్ గా ఉన్న ఒకే ఒక్క విషయం డ్రగ్స్ తగలబెడుతున్నప్పుడు గ్యాస్ మాస్కులు పెట్టుకోవడం ఒక్కటే.

అయితే.. క్లైమాక్స్ ను డీల్ చేసిన విధానం మాత్రం సినిమాని కాపాడింది. కాస్త బోర్డర్ దాటినట్లుగా అనిపించే సన్నివేశాలు కూడా ఉన్నాయి. డిస్ట్రబింగ్ గా ఉన్నప్పటికీ.. సమాజంలో ఎక్కడో ఒకచోట ఇలాంటివన్నీ జరుగుతూనే ఉన్నాయి కదా అనిపించకమానదు. సో, దర్శకుడిగా గుణశేఖర్ ఆలోచింపజేసి, రచయితగా మాత్రం పూర్తిస్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు.

Euphoria Movie Review and Rating

విశ్లేషణ: కొన్ని సినిమాలు ఆనందింపజేస్తే.. చాలా తక్కువ సినిమాలు ఆలోచింపజేస్తాయి. “యుఫోరియా” అలాంటి సినిమానే. అయితే.. ఫస్టాఫ్ కే సినిమా కథ ముగియడంతో.. సెకండాఫ్ ను గుణశేఖర్ చాలా కన్వీనియెంట్ గా సాగదీసిన విధానం అప్పటివరకు క్రియేట్ అయిన ఇంపాక్ట్ ని కిల్ చేసింది.

అయితే.. క్లైమాక్స్ లో వచ్చే రియలైజేషన్ ఎపిసోడ్ మాత్రం థియేటర్ నుండి బయటికి వెళ్లే ప్రేక్షకుల మదిలో ఓ ఆలోచన రేకెత్తిస్తుంది. అద్భుతంగా ఉంది, మస్ట్ వాచ్ అని చెప్పలేం కానీ.. నవతరం పిల్లల్ని పెంచే క్రమంలో తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన బాధ్యతలను గుర్తుచేస్తుందని మాత్రం చెప్పగలం.

Euphoria Movie Review and Rating

ఫోకస్ పాయింట్: సమాజానికి అవసరమైన సినిమా కానీ.. అనవసరంగా సాగదీశారు!

రేటింగ్: 2.5/5

Rating

2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhumika Chawla
  • #Euphoria Movie
  • #Gunasekhar
  • #Sara arjun
  • #Vignesh

Reviews

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

trending news

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

18 hours ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

21 hours ago
Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

20 hours ago
Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

2 days ago
JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

2 days ago
Atlee – Sai Abhyankar: అట్లీ, అభ్యంకర్‌ను బయటే కూర్చోబట్టిన మ్యూజిక్‌ బృందం.. తర్వాతే ఏమైందంటే?

Atlee – Sai Abhyankar: అట్లీ, అభ్యంకర్‌ను బయటే కూర్చోబట్టిన మ్యూజిక్‌ బృందం.. తర్వాతే ఏమైందంటే?

2 days ago
Eva Marie: 90 ఏళ్ల వయసులోనూ నటించిన ప్రముఖ నటి మృతి

Eva Marie: 90 ఏళ్ల వయసులోనూ నటించిన ప్రముఖ నటి మృతి

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version