Evaru Meelo Koteeswarulu: ‘ఎవరు మీలో కోటీశ్వరులు’లో సందడి చేసిన ‘ఆర్‌ఆర్ఆర్‌’ దోస్తీ!

మంచి కామెడీ టైమింగ్‌ ఉన్న ఇద్దరు హీరోలు ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే ఎలా ఉంటుంది. బొమ్మ దద్దరిల్లిపోతుంది. ఆ ఇద్దరే తారక్‌, రామ్‌చరణ్‌. అలాంటి కాంబినేషన్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో సాధ్యమవుతోంది. అయితే అందులో ఇద్దరు హీరోలను ఒకే ఫ్రేమ్‌లో చూడొచ్చు కానీ… అంతగా కామెడీ చూసే పరిస్థితి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆ సినిమా నేపథ్యం అలాంటిదే. అయితే ఆ ఇద్దరు పంచే వినోదాన్ని ఈ నెల 22న బుల్లితెరపై చూడొచ్చు. ఎందుకంటే ఆ రోజే తారక్‌ హోస్ట్‌ చేస్తున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ స్టార్ట్‌ అవుతోంది కాబట్టి.

‘ఎవరు మీలో కోటీశ్వరులు’ తో తారక్‌ తొలిసారి క్విజ్‌ తరహా షోను హోస్ట్‌ చేస్తున్నాడు. చాలా కాలం క్రితమే షో మొదలవ్వాల్సి ఉన్నా… కరోనా పరిస్థితుల కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా షోను ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ నెల 22న షో కర్టెన్‌ రైజర్‌ టెలీకాస్ట్‌ కాబోతోంది. అందులో ముఖ్య అతిథిగా రామ్‌చరణ్‌ రాబోతున్నాడు. దీనికి సంబంధించిన ప్రోమోను జెమినీ టీవీ ఇటీవల విడుదల చేసింది. అందులో పంచ్‌లున్నాయి చూడండి… మామూలుగా ఉండవు.

హోస్ట్‌ సీట్‌, హాట్‌ సీట్‌ పంచ్‌తో మొదలైన నవ్వుల సందడి… మధ్యలో ‘ఆ ప్రశ్నలు ఇక్కడ ఎందుకులెండీ’ అని రామ్‌చరణ్‌ అనడంతో ఆ సందడి రెట్టింపు అయ్యింది. ఆఖరులో ‘ఓర్నీ అవునా…’ అని రామ్‌చరణ్‌ ఎటకారంగా మాట్లాడటం కనిపిస్తుంది. ప్రోమోనే ఇలా అదిరిపోయిందంటే… కర్టెన్‌ రైజర్‌ ఎపిసోడ్‌ ఇంకెంత అదిరిపోతుందో చూడాలి. ఇప్పటికే ప్రోమో చూసేసుంటే ఓకే… లేదంటే ఓ సారి లుక్కేయండి మరి.


నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus