రెండ్రోజుల్లో రిలీజవుతున్నా బజ్ మాత్రం రావడం లేదు

  • March 26, 2019 / 07:04 PM IST

మెగా ఫ్యామిలీకి చెందిన హీరోలు ఎవరైనా సరే.. వాళ్ళ సినిమా విడుదలవుతుంది అంటే మినిమమ్ బజ్ ఉంటుంది. ఆ హీరో ఇమేజ్ తో సంబంధం లేకుండా మెగా అభిమానులందరూ వారి సినిమాలను ఆదరిస్తూనే ఉన్నారు. ఏమాత్రం కంటెంట్ బాగున్నా సినిమాను హిట్ చేసే బాధ్యతను వారి నెత్తిపై వేసుకొంటారు. కానీ.. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఏకైక కథానాయిక అయిన నీహారిక సినిమాలకు మాత్రం ఎప్పుడూ మినిమమ్ బజ్ కూడా ఉండదు. మొదటి సినిమా “ఒక మనసు” నుంచి రెండ్రోజుల్లో విడుదలకానున్న “సూర్యకాంతం” వరకూ అదే పరిస్థితి.

పోనీ ఒక మనసు సీరియస్ సినిమా, హ్యాపీ వెడ్డింగ్ ఏదో కాన్సెప్ట్ సినిమా కాబట్టి బజ్ క్రియేట్ అవ్వలేదు అనుకుందాం. కానీ.. పూర్తిస్థాయిలో కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన “సూర్యకాంతం” చిత్రానికి కూడా బజ్ రావడం లేదు. ఇవాళ విడుదలైన ట్రైలర్ పర్వాలేదనిపించుకున్నా.. జనాలు మాత్రం ఎందుకో ఆసక్తి చూపడం లేదు. మరి విడుదలయ్యాక రివ్యూలు, టాక్ ఏమైనా బాగుంటే అప్పుడేమైనా ఆసక్తి కనబరుస్తారేమో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus