వెంకటేష్, వరుణ్ తేజ్ లు హీరోలుగా తమన్నా, మెహ్రీన్ లు హీరోయిన్లుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎఫ్3’. 2019 లో వచ్చిన ‘ఎఫ్2’ కి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ మూవీని ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ లు నిర్మించారు. సోనాల్ చౌహాన్ ,మురళీ శర్మ, సునీల్, అలీ, రాజేంద్ర ప్రసాద్ వంటి స్టార్ క్యాస్టింగ్ కూడా ఉండడంతో మొదటినుండీ ఈ మూవీ పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
ఇక మే 27న విడుదలైన ఈ మూవీ మొదటి షోతోనే హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. దీంతో ఫస్ట్ వీక్ మంచి కలెక్షన్లను రాబట్టింది.కానీ రెండో వారం ‘మేజర్’,’విక్రమ్’ వంటి సినిమాలు రిలీజ్ అవ్వడంతో ‘ఎఫ్3’ కలెక్షన్లు బాగా తగ్గాయి. కానీ ఉన్నంతలో ఈ మూవీ బాగానే రాబడుతుంది.! ‘ఎఫ్ 3’ 13 డేస్ కలెక్షన్స్ ను ఓసారి గమనిస్తే :
నైజాం
17.55 cr
సీడెడ్
5.83 cr
ఉత్తరాంధ్ర
5.69 cr
ఈస్ట్
3.21 cr
వెస్ట్
2.42 cr
గుంటూరు
3.20 cr
కృష్ణా
2.79 cr
నెల్లూరు
1.73 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
42.42 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
2.90 cr
ఓవర్సీస్
7.03 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
52.35 cr
‘ఎఫ్3’ మూవీకి రూ.63.82 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కు రూ.64 కోట్ల షేర్ ను రాబట్టాలి. 13 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.52.35 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు ఈ మూవీ రూ.11.65 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. పోటీగా ‘మేజర్’ ‘విక్రమ్’ వంటి క్రేజీ సినిమాలు విడుదలవడంతో ‘ఎఫ్3’ కలెక్షన్లు బాగా తగ్గాయి. కానీ ఉన్నంతలో పర్వాలేదు అనిపిస్తుంది. నిన్న కూడా ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రూ.0.24 కోట్ల షేర్ ను రాబట్టింది.