మన టాలీవుడ్ హీరోయిన్ లు అబ్బాయిలైతే ఇలాగే ఉంటారేమో..!

1992లో వచ్చిన ‘జంబలకిడిపంబ’ చిత్రం అందరికీ గుర్తుండే ఉంటుంది. దివంగత ఇ.వి.వి.సత్యనారాయణ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. సినిమా మొదలైనప్పటి నుండీ ఎండింగ్ కార్డ్ పడే వరకూ ప్రేక్షకులు నవ్వుతూనే ఉంటారు. అయితే ఈ చిత్రంలో ‘మగవారు ఆడవారిగా మారడం.. మగవారు ఆడవారిగా మారడం’ అనే కాన్సెప్ట్ చాలా సిల్లీగా అనిపించినప్పటికీ.. ప్రేక్షకులకు చాలా బాగా కనెక్ట్ అయ్యింది. ఇప్పటికీ ఈ చిత్రాన్ని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు.

నిజానికి రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించాల్సిన ఈ చిత్రం.. ఆయన కాల్ షీట్స్ ఖాళీగా లేక హీరో నరేష్ వద్దకు వెళ్ళినట్టు తెలుస్తుంది. ఇదిలా ఉండగా.. ఈ క్లాసిక్ చిత్రాన్ని మన సౌత్ నటీమణులుకు అప్లై చేసింది మన ‘ఫేస్ యాప్’. గతంలో ఈ ‘ఫేస్ యాప్’ మన యంగ్ హీరోలను .. క్రికెటర్ లను, ముసలి వాళ్ళుగా మార్చేసింది. అప్పుడు ఆ ఫోటోలను కూడా తెగ వైరల్ చేసారు మన నెటిజెన్లు.

అయితే ఇప్పుడు అదే యాప్ మనకు ‘జంబలకిడిపంబ’ కొత్త వెర్షన్ ను కూడా పరిచయం చేసింది. అదెలాగంటే ఏకంగా మన టాలీవుడ్ స్టార్ నటీమణులను అబ్బాయిలను చేసేసింది. అంటే నిజంగా కాదు లెండి… మన స్టార్ నటీమణులు అబ్బాయిలైతే ఎలా ఉంటారో చూపించింది. అదెలాగో..? ఆ నటీమణులు ఎవరో? ఒకవేళ వాళ్ళు అబ్బాయిలు అయితే వాళ్ళకు ఏం పేర్లు పెట్టొచ్చో మీరే ఓ లుక్కెయ్యండి.

1)కాజా (కాజల్)

2)హసన్ (శృతి హాసన్)

3) అనుష్(అనుష్క)

4)ఖన్నా(రాశీ ఖన్నా)

5)సురేష్ (కీర్తి సురేష్)

6)టామ్(తమన్నా)

7)సమంత్(సమంతా)

8)మంచు వారి అబ్బాయి(మంచు లక్ష్మీ)

 

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus