కొన్ని ఫుడ్స్ గురించి వింటుంటేనే నోరూరుపోతుంటుంది. అలాగే సినిమాల్లో కొన్ని కాంబినేషన్ల గురించి వింటుంటేనే మనసు మురిసిపోతుంది. ఆ కాంబినేషన్‌లో వచ్చే సినిమా ఫీల్ తెలిసినవాళ్లకే ఆ ఫీలింగ్ కలుగుతుంటుంది. సేమ్ ఇండస్ట్రీలోనే సినిమాలు చేసే మన దగ్గర.. పక్క ఇండస్ట్రీ దర్శకుడితో మన హీరో సినిమా చేస్తే బాగుండు అని కచ్చితంగా అనిపిస్తుంది. అలా ఇప్పుడు ఓ డ్రీమ్ కాంబో సెట్ అయింది అని అంటున్నారు. హిందీ – నాన్ హిందీ కాంబినేషన్..
చాలా ఏళ్లుగా కలగానే మిగిలిపోయిన ఈ ఆలోచన ఇప్పుడు నెరవేరుతోంది. పాన్ ఇండియా ఫీవర్.. కరోనా – లాక్‌డౌన్ పరిస్థితుల వల్ల అక్కడివాళ్లు, ఇక్కడి వాళ్లు కలసి సినిమాలు చేస్తున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ దర్శకుడు, మాలీవుడ్ హీరో కలసి ఓ సినిమా చేయబోతున్నారు. అదే ఇంతియాజ్ అలీ – ఫహాద్ ఫాజిల్ (Fahadh Faasil). అవును ఈ కాంబో సెట్ అయింది. మలయాళ, తెలుగు, తమిళ చిత్రాల్లో తనదైన ముద్ర వేసుకున్న నటుడు ఫహాద్ ఫాజిల్.
కథానాయకుడిగా, నటుడిగా వరుస సినిమాలు చేస్తున్న ఫహాద్.. ఇప్పుడు ఓ హిందీ సినిమా ఓకే చేశారట. ఆ సినిమాతో త్వరలో ఫహాద్ (Fahadh Faasil) బాలీవుడ్‌లోకి అడగుపెట్టనున్నట్లు సమాచారం. ప్రముఖ హిందీ దర్శకుడు ఇంతియాజ్ అలీతో ఈ సినిమాను హ్యాండిల్ చేస్తారు అని చెబుతున్నారు. తనదైన శైలిలో ఇంతియాజ్ అలీ ఈ సినిమాను ప్రేమకథగా రూపొందిస్తున్నారట. ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉన్న ఈ సినిమా అనౌన్స్‌మెంట్ త్వరలో ఉంటుంది అని చెబుతున్నారు.
అన్నీ అనుకున్నట్లుగా జరిగితే వచ్చే ఏడాది సినిమా సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఫహాద్ (Fahadh Faasil) సరసన నటించే కథానాయిక కోసం వెతుకులాట జరుగుతోందట. మరోవైపు ఫహాద్ ఫాజిల్ సినిమాలు చూస్తే.. అల్లు అర్జున్ (Allu Arjun) – సుకుమార్ (Sukumar) ‘పుష్ప: ది రూల్’ (Pushpa 2), రజనీకాంత్ (Rajinikanth)318, 521187, 521279 ‘వేట్టయాన్’ (Vettaiyan) లో కీలక పాత్రల్లో నటిస్తుండగా.. మలయాళ సినిమాలు ‘ఒడుమ్ కుతిర చడుమ్ కుతిర’, ‘బౌగెయిన్‌విల్లే’ చేస్తున్నారు. ఇక తెలుగులో స్ట్రెయిట్ సినిమాగా ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ చేస్తున్నారు.