The Greatest of All Time Review in Telugu: ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం సినిమా రివ్యూ & రేటింగ్!

  • September 5, 2024 / 01:12 PM IST

Cast & Crew

  • విజయ్ (Hero)
  • మీనాక్షి చౌదరి (Heroine)
  • స్నేహ, ప్రశాంత్, ప్రభుదేవా, మోహన్, ప్రేమ్ జీ (Cast)
  • వెంకట్ ప్రభు (Director)
  • కల్పత్తి ఎస్ అఘోరం, కల్పత్తి ఎస్ గణేష్, కల్పత్తి సురేష్ (Producer)
  • యువన్ శంకర్ రాజా (Music)
  • సిద్ధార్థ్ నుని (Cinematography)

తలపతి విజయ్ (Thalapathy Vijay) టైటిల్ పాత్రలో వెంకట్ ప్రభు (Venkat Prabhu) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “గోట్” (The Greatest of All Time). విజయ్ నటించిన 68వ సినిమా కావడం, రాజకీయాల్లోకి క్రియాశీలక ఎంట్రీ ముందు నటించిన సినిమా కావడంతో.. ట్రేడ్ వర్గాల్లో కంటే అభిమానుల్లో ఈ సినిమాకి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. అయితే.. సినిమా ప్రమోషనల్ కంటెంట్ ఏదీ కూడా సరిగా వర్కవుటవ్వలేదు. ముఖ్యంగా ఒక్కటంటే ఒక్క పాట కూడా ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోయింది. మరి ప్రస్తుతానికి విజయ్ ఆఖరి చిత్రంగా పేర్కొంటున్న ఈ చిత్రం ప్రేక్షకులకు ఏమేరకు నచ్చింది అనేది చూద్దాం..!!

The Greatest of All Time Review

కథ: యాంటీ టెర్రరిస్ట్ గ్రూప్ కి లీడర్ అయిన గాంధీ (విజయ్) కెన్యాలో చేపట్టిన ఒక మిషన్ అతడి జీవితంలో పెను మార్పులు తీసుకొస్తుంది. భార్యాబిడ్డలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ మిషన్ తర్వాత ఏజెన్సీ ఉద్యోగానికి కూడా గుడ్ బై చెప్పి.. సాధారణ జీవితం గడుపుతుంటాడు. అయితే.. చిన్నప్పుడు చనిపోయాడనుకున్న కొడుకు జీవన్ (విజయ్) మళ్ళీ కనిపించడంతో, తాను కోల్పోయిన ఆనందం మళ్ళీ దొరికింది అనుకుంటాడు. కట్ చేస్తే.. గాంధీ టీమ్ మెంబర్స్ ఒక్కొక్కరుగా చనిపోతుంటారు. వారి మరణాల వెనుక ఉన్నది ఎవరు? కెన్యాలో చేపట్టిన మిషన్ ఏమిటి? వంటి ప్రశ్నలకు సమాధానమే “గోట్” (The Greatest of All Time) చిత్రం.

నటీనటుల పనితీరు: విజయ్ కి ఈ సినిమాలో విగ్ అస్సలు సెట్ అవ్వలేదు. ముఖ్యంగా యంగ్ విజయ్ గా చూపించడం కోసం డీ-ఏజింగ్ టెక్నాలజీతో తీర్చిదిద్దిన విజయ్ ముఖం ముభావంగా ఉన్నప్పుడు కాస్త పర్లేదు కానీ.. మాట్లాడేప్పుడు చూడడానికి చాలా ఇబ్బందిగా ఉంది. అయితే.. విజయ్ కాంత్ ను ఈ సినిమాలో రీక్రియేట్ చేసి చూపించడం తమిళ సినిమా అభిమానులకు బాగా కనెక్ట్ అవుతుంది. అయితే.. నటుడిగా యంగ్ విజయ్ గా కంటే ముసలి విజయ్ గానే అలరించగలిగాడు. బాడీ లాంగ్వేజ్ & మ్యానరిజమ్స్ విషయంలో మాత్రం వ్యత్యాసం చూపించి తన అభిమాలను ఆకట్టుకున్నాడు విజయ్.

విజయ్ తర్వాత ప్రశాంత్ (Prashanth), ప్రభుదేవా (Prabhudeva), అజ్మల్ (Ajmal Ameer), జయరాంలు (Jayaram) కాస్త అలరించే ప్రయత్నం చేసారు కానీ.. వాళ్ల క్యారెక్టర్స్ కి సరైన ఆర్క్ లేకపోవడంతో సైడ్ క్యారెక్టర్స్ లా మిగిలిపోయారు. మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) కేవలం ఒక పాట, రెండు సీన్స్ లో అలా మెరిసి మాయమైపోయింది. సినిమాకి చాలా కీలకమైన విలన్ పాత్ర పోషించిన మోహన్.. విలనిజాన్ని పండించలేకపోయాడు, అతడి పాత్ర కనీస స్థాయి ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. శివకార్తికేయ (Sivakarthikeyan) క్యామియో చిన్నపాటి కిక్ ఇవ్వగా.. త్రిష (Trisha) స్పెషల్ సాంగ్ అప్పియరెన్స్ కాస్త ఎనర్జీ యాడ్ చేసింది. స్నేహ (Sneha) , లైలా (Laila), వైభవ్ (Vaibhav) లు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతికవర్గం పనితీరు: సినిమాలో విలన్ సరిగా పెర్ఫార్మ్ చేయలేదు అనుకుంటాం కానీ.. సినిమాకి మెయిన్ విలన్ యువన్ శంకర్ రాజా (Yuvan Shankar Raja) . సినిమాలో ఉన్న కొద్దిపాటి ఎలివేషన్స్ & ట్విస్ట్స్ ను కూడా తన నేపథ్య సంగీతంతో ఎలివేట్ చేయలేకపోయాడు. యువన్ కెరీర్లో వీకెస్ట్ వర్క్ గా ఈ చిత్రాన్ని పేర్కొనవచ్చు. సినిమాటోగ్రఫీ వర్క్ కూడా సోసోగా ఉంది. అందుకు కారణం పూర్ వి.ఎఫ్.ఎక్స్ వర్క్ కావచ్చు. వి.ఎఫ్.ఎక్స్ విషయంలో చేసిన లాస్ట్ మినిట్ ఛేంజెస్ సినిమాకి బాగా ఎఫెక్ట్ ఇచ్చాయి. కొన్ని ఫ్రేమ్స్ బ్రైట్ గా, కొన్ని ఫ్రేమ్స్ డార్క్ గా కనిపిస్తాయి. అది చిన్నపాటి తప్పిదమే అయినప్పటికీ.. 400 కోట్ల రూపాయల బడ్జెట్ సినిమాలో అలాంటి తప్పులు దొర్లడం అనేది పెద్ద మైనస్ అనే చెప్పాలి. ఇక డీ-ఏజింగ్ టెక్నాలజీతో క్రియేట్ చేసిన విజయ్ కంటే.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో క్రియేట్ చేసిన విజయ్ కాంత్ సీన్స్ బాగున్నాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

దర్శకుడు వెంకట్ ప్రభు ఎంత బుకాయించినా “గోట్” సినిమా సీన్ టు సీన్ కాకపోయినా స్ట్రక్చర్ వరకు హాలీవుడ్ చిత్రం “జెమినీ మ్యాన్” (2019)కి కాపీ పేస్ట్ లా ఉంటుంది. అదే విధంగా.. విజయ్ వర్సెస్ విజయ్ అనే కాన్సెప్ట్ ను వెంకట్ ప్రభు సరిగా వాడుకోలేకపోయాడు. అజిత్ తో (Ajith) తెరకెక్కించిన “గ్యాంబ్లర్” (Mankatha) చిత్రంలో ఇదే తరహాలో హీరోతో విలనిజం పండించి ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచిన వెంకట్ ప్రభు.. “గోట్” సినిమాలో విజయ్ తో పండించిన విలనిజంతో ఆ మ్యాజిక్ ను రిపీట్ చేయలేకపోయాడు. కాకపోతే.. క్లైమాక్స్ సీన్ లో విజయ్ & ధోనీనీ కంపేర్ చేస్తూ రాసుకున్న చెపాక్ స్టేడియం ఎపిసోడ్ మాత్రం ఓ మేరకు ఆడియన్స్ ను అలరిస్తుంది. ఓవరాల్ గా తనకు లభించిన గోల్డెన్ ఛాన్స్ ను వెంకట్ ప్రభు వినియోగించుకోవడంలో విఫలమయ్యాడనే చెప్పాలి.

విశ్లేషణ: హాలీవుడ్ సినిమాల ఊసు తెలియని మాస్ ఆడియన్స్ ను మినహాయిస్తే.. “గోట్” చిత్రం రెగ్యులర్ ఆడియన్స్ ను ఆకట్టుకోవడంలో విఫలమైంది. ముఖ్యంగా డీ-ఏజింగ్ టెక్నాలజీ సినిమాకి పెద్ద మైనస్. విజయ్ వీరాభిమానులు తప్ప మూడు గంటలపాటు థియేటర్లో ఈ సినిమాను మిగతావారు భరించడం కాస్త కష్టమే!

ఫోకస్ పాయింట్: అంత గ్రేట్ గా ఏమీ లేదు!

రేటింగ్: 2/5

Click Here to Read In ENGLISH

Rating

2
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus