బిగ్ బాస్ సీజన్ 6.. దాదాపు క్లైమాక్స్ కు వచ్చేసింది అనే చెప్పాలి. విన్నర్ ఎవరో మరికొద్ది రోజుల్లో తేలిపోతుంది. ఈ సీజన్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్లు.. అనుకున్న వాళ్ళు వరుసగా ఎలిమినేట్ అవుతున్న సంగతి తెలిసిందే. ఫైమా ఎలిమినేషన్ తో అది మరోసారి రుజువైంది. హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన టైంలో ఫైమా స్ట్రాంగ్ కంటెస్టెంట్ లా కనిపించింది. మొదట్లో తోటి కంటెస్టెంట్లు విసిగించినా ఈమె కూల్ గా ఉండేది. ఫన్ ను జెనరేట్ చేసేది.
కానీ తర్వాత సీరియస్ గా గేమ్ ఆడటం స్టార్ట్ చేశాక ఈమె … బ్యాలన్స్ తప్పింది. వెటకారంతో… కూడిన సీరియస్ ఆన్సర్స్ ఇవ్వడంతో ఈమె అందరికీ టార్గెట్ అయ్యింది. ఇక బిగ్ బాస్ నుండీ ఎలిమినేట్ అయ్యాక.. ఫైమా బిగ్ బాస్ కేఫె ఇంటర్వ్యూలో యాంకర్ శివ తో ముచ్చటించింది. ఇందులో భాగంగా … ఎందుకు మీరు వెటకారం అదీ తగ్గించుకోకుండా సీరియస్ అయ్యారు అని అతను అడిగాడు. అందుకు ఫైమా ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్ ఇచ్చింది.
‘ నేను బయట ఎలా ఉన్నానో హౌస్ లో కూడా అలాగే ఉన్నాను. నేను ఎవ్వరినీ కావాలని టార్గెట్ చేయలేదు అని చెప్పిన ఫైమా.. నాకు హౌస్ లో నుండీ ఒకరిని ఎలిమినేట్ చేసే ఛాన్స్ ఇస్తే నేను రేవంత్ ను చేస్తాను. అతను గేమ్ ఆడేముందు అందరికీ వార్నింగ్ లు ఇస్తాడు… గేమ్ అయిపోయాక వచ్చి సారీ చెబుతాడు. ఆది రెడ్డి బాగానే ఆడతాడు కానీ అతను సీరియస్ గా అలోచనలో పడిపోతాడు.
నేను స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్న గీతు ఎలిమినేట్ అయినప్పుడు నా అంచనాలు అన్నీ తారుమారైపోయాయి. అప్పుడే నేను టాక్ 5 లో ఉండే అవకాశం లేదు అని క్లారిటీ వచ్చేసింది. ‘ అంటూ ఫైమా చెప్పుకొచ్చింది.